Pet dogs : కుక్కలా మారాలనుకున్న మనిషి.. ఆ కోరిక తీరాక ఏం చేశాడంటే..

by Javid Pasha |
Pet dogs : కుక్కలా మారాలనుకున్న మనిషి.. ఆ కోరిక తీరాక ఏం చేశాడంటే..
X

దిశ, ఫీచర్స్ : మనుషులు ఎవరైనా కుక్కలను పెంచుకోవాలని అనుకుంటారు. వాటిని ప్రేమగా చూసుకుంటారు. అంతే కానీ తాము కూడా కుక్కలా మారాలని, కుక్కలా జీవించాలని ఎవరైనా అనుకుంటారా? కానీ ఓ వ్యక్తి మాత్రం అనుకున్నాడు. అందుకోసం ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు కూడా చేశాడు. అదొక్కటే కాదు, ఒక్కలా మారే కోరిక తీరిన తర్వాత మరో అతనిలో మరో కోరిక పుట్టింది. ప్రస్తుతం నాలుగైదు జంతువుల్లా మారి తన కోరిక తీర్చుకోవాలని భావిస్తున్నాడట. అదెలా సాధ్యం?

జంతువుల మీద ప్రేమో లేక వెరైటీగా ఆకట్టుకోవాలనే ఉద్దేశమో కానీ గతంలో జపాన్‌కు చెందిన టోకో అనే ఓ వ్యక్తి తాను కుక్కలా మారేందుకు అక్షరాల రూ.12 లక్షలు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో అతను కుక్కలా బతకాలనే కోరికను నెరవేర్చుకునేందుకు జప్పెట్ అనే రియలిస్టిక్ కాస్ట్యూమ్ డిజైన్ సంస్థను సంప్రదించాడు. ఆ సంస్థ కూడా టోకో కోరిక నెరవేర్చడాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకుంది. అచ్చం కుక్క మాదిరి శరీర నిర్మాణాన్ని పోలిన కాస్ట్యూమ్ డిజైనింగ్‌తో డాగ్ బాడీని తయారు చేసి ఇచ్చింది. దీంతో టోకో దానిని ధరించి కుక్కలా మారిపోయాడు. ఇదంతా గతంలో జరిగిన కథ. కానీ ప్రస్తుతం ఆ టోకో అనే వ్యక్తి మరో వింత కోరికతో ప్రజల ముందుకు వచ్చాడు.

టోకో ప్రస్తుతం పిల్లి లేదా పాండా జంతువుల్లా మారాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ప్రకటించాడు. త్వరలోనే తన కోరిక తీర్చుకుంటానని వెల్లడించాడు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నావని పలువురు ప్రశ్నించగా తనకు చిన్నప్పటి నుంచి జంతువులంటే చాలా ప్రేమ అని, అందుకే అలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే కుక్కలా జీవించాలన్న కోరికను నెరవేర్చుకున్న టోకో ఇక పాండా లేదా పిల్లిలా జీవించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ కోరిక తీరిన తర్వాత మరో నాలుగైదు జంతువుల్లా మారాలని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడైతే పిల్లిలా మారాలనుకుంటున్నందున ఆపోలికతో కాస్ట్యూమ్‌ను డిజైనింగ్ కోసం ఆర్డర్ ఇచ్చాడట. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా! అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Click Here For Twitter Post..

Next Story