క్యాన్సర్‌ ముప్పు తగ్గాలంటే వీటిని రోజూ తీసుకుంటే చాలు..

by Disha Web Desk 10 |
క్యాన్సర్‌ ముప్పు తగ్గాలంటే వీటిని రోజూ తీసుకుంటే చాలు..
X

దిశ,వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఆడమగ తేడా లేకుండా అందరూ క్యాన్సర్‌ సమస్యతో భాదపడుతున్నారు. అయితే, ఈ సమస్యకు ఇప్పటి వరకు సరయిన వైద్యం కనుగొనలేకపోయారు. దానికి కారణం జీవనశైలితో పాటు అనేక రకాల పర్యావరణ సమస్యల వలన క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్‌ కూడా ఒకటి. ఈ చర్మ క్యాన్సర్‌ ను వీటితో తగ్గించుకోవచ్చని పరిశోధనలు చేసి వెల్లడించారు. అదేంటో ఇక్కడ చూద్దాం..

ఆలివ్‌ సీడ్స్‌ మన అందరికి తెలిసినవే. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని కొన్ని ప్రాంతాల్లో హలీమ్‌, గార్డెన్ క్రెస్ విత్తనాలని పిలుస్తుంటారు. ఈ విత్తనాలను మనం రెగ్యులర్ గా తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆలివ్‌ విత్తనాలు చిన్నగా, ఎర్రరంగులో ఉంటాయని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈ చిన్నచిన్నగా ఉండే విత్తనాల్లో.. విటమిన్ సి, ఇ, ఎ, ఫోలేట్, ఫైబర్‌, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఆలివ్‌ విత్తనాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ‌, కార్సినోజెనిక్, ఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్ లక్షణాలు మెండుగా ఉంటాయి. శరీర కణాలను రక్షించి క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తోంది. ఈ విత్తనాలలో గ్లూకోసినోలేట్స్ క్యాన్సర్ విస్తరణను, అభివృద్ధిని నిరోధిస్తోంది. ఎక్కువసేపు నిండుగా ఉంచి ఆకలి కోరికలను, అతిగా తినకుండా కంట్రోల్‌ చేస్తుంది. అలాగే బరువును కూడా కంట్రోల్‌లో ఉంచి.. హెల్తీగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతోంది.

Next Story