ఆయిల్, మేకప్ రిమూవర్.. మేకప్ తొలగించడానికి ఏది మంచిది ?

by Disha Web Desk 20 |
ఆయిల్, మేకప్ రిమూవర్.. మేకప్ తొలగించడానికి ఏది మంచిది ?
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు ఏదైనా అకేషన్ వస్తే చాలు మేకప్ వేసుకుంటున్నారు. అయితే మేకప్ వేసుకున్నప్పుడు చర్మం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ముఖం పై మేకప్ సరిగ్గా తొలగించకపోతే చర్మం దెబ్బతింటుందని నిపుణులు చెబుతన్నారు. అందుకే నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలని చర్మ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మేకప్‌ను తొలగించేందుకు కొందరు మేకప్ రిమూవర్‌ను ఉపయోగిస్తే మరికొందరు ఆయిల్‌ను ఉపయోగిస్తారు. అయితే కొంతమంది ఫేస్ వాష్‌తో మాత్రమే ముఖాన్ని కడుక్కుంటుంటారు. అయితే వీటిలో ఏది సరైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

నూనె లేదా మేకప్ రిమూవర్ ఏది మంచిది ?

ఆయిల్‌తో మేకప్‌ను తొలగించే అలవాటు ఉంటే వారి చర్మం త్వరలో పాడైపోతుందని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చర్మం రంధ్రాలు త్వరగా నూనెతో నిండిపోతాయని చెబుతున్నారు. దీంతో ముఖం పై మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వస్తాయట. కొందరు ఆయిల్ తో మేకప్ తొలగించడంలో కూడా సమస్యలను ఎదుర్కొంటారు. మహిళలు మేకప్ రిమూవర్‌ని ఉపయోగించి మేకప్ తొలగిస్తే వారి చర్మం శుభ్రంగా మారి, చర్మం మెరుస్తుందని చెబుతున్నారు. మేకప్ రిమూవర్‌ని ఉపయోగించడం వల్ల చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుందట.

మేకప్ రిమూవర్లు ఎన్ని రకాలు ?

మేకప్ రిమూవర్ లో వైప్స్, మేకప్ రిమూవర్ ఆయిల్, మేకప్ రిమూవర్ ప్యాడ్స్, మేకప్ రిమూవర్ లోషన్ వంటి అనేక రకాల మేకప్ రిమూవర్‌లను మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. మీరు వీటిని ద్రవ, పొడి రూపంలో తీసుకోవచ్చు. దానితో వాటర్‌ప్రూఫ్ మేకప్‌ను కూడా సులభంగా తొలగించవచ్చు.

మేకప్ ను ఎందుకు తొలగించాలి..

దాదాపు ప్రతి అమ్మాయి ఏదైనా పార్టీకి లేదా ఫంక్షన్‌కి వెళ్లే ముందు మేకప్ వేసుకుంటుంది. ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా మేకప్ వేసుకోవడం మొదలుపెట్టారు. అయితే మేకప్ వేసుకోవడం ఎంత ముఖ్యమో మేకప్ తీసేయడం కూడా అంతే ముఖ్యం. మేకప్ తీయకుండా నిద్రపోవడం వల్ల ముఖం పై మురికి పేరుకుపోయి, త్వరలో ముఖం పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది. రోజూ మేకప్ వేసుకునే అమ్మాయిల చర్మం త్వరగా పొడిబారి గరుకుగా మారుతుంది. అలాంటప్పుడు వారు మేకప్ ను తొలగించకుండా అస్సలు నిద్రపోకూడదు.


Next Story

Most Viewed