కప్పు కాఫీతో పిల్లలకు గుండె ప్రమాదం.. చాక్లెట్స్ కూడా ఈ కోవలోకే !

by Dishanational2 |
కప్పు కాఫీతో పిల్లలకు గుండె ప్రమాదం.. చాక్లెట్స్ కూడా ఈ కోవలోకే !
X

దిశ, ఫీచర్స్ : మనం కాఫీ క్రేజ్‌డ్ కల్చర్‌గా మారిపోయాం. కప్పు కాఫీ మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, చిత్తవైకల్యం‌తో పాటు కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని గత అధ్యయనాలు స్పష్టం చేయడంతో బేఫికర్‌గా రోజుకు మూడు నాలుగు కాఫీలు సిప్ చేసేస్తున్నాం. అయితే పెద్దల సంగతి ఎలా ఉన్నా పిల్లలకు మాత్రం కాఫీ హానికరమని హెచ్చరిస్తున్నారు శిశువైద్యులు, నిపుణులు. కెఫినేటెడ్ బివరేజెస్ అయిన సోడాలు, స్పోర్ట్స్ డ్రింక్స్, టీ, చాక్లెట్స్, చూయింగ్ గమ్, మింట్స్, గమ్మీ బియర్స్, ఎనర్జీ బార్స్, కాఫీ ఐస్ క్రీమ్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

ఇంతకీ ప్రమాదమేంటి?

పిల్లల బాడీ సైజ్ తక్కువగా ఉండటం మూలంగా కెఫిన్ శరీర పనితీరును దెబ్బతీస్తుంది. జీవక్రియను మందగిస్తుంది. అధిక కెఫిన్ హృదయ స్పందన రేటు, రక్తపోటును పెంచుతుంది. యాసిడ్ రిఫ్లక్స్‌కు దోహదం చేస్తుంది. తద్వారా పిల్లలలో ఆందోళన, నిద్ర భంగం కలిగించవచ్చు. క్రమరహిత, వేగవంతమైన హృదయ స్పందనతో ఎమర్జెన్సీ తలుపు తట్టాల్సి ఉంటుంది. ఇక మైగ్రేన్, మూర్ఛ, గుండె సమస్యలున్న పిల్లలకు మరింత హానికరం.

నిజానికి 12ఏళ్ల వరకు పిల్లలకు కెఫైనేటెడ్ పానియాలు ఇవ్వకూడదు. ఇక 12 నుంచి 18ఏళ్ల మధ్య ఏజ్ గ్రూప్.. రోజుకు 100 మి.గ్రా. కన్నా తక్కువ కెఫిన్ తీసుకోవచ్చు. అయితే రోస్టెడ్ కాఫీ కప్‌లో 360 మి.గ్రా.. స్పోర్ట్స్ డ్రింక్‌ 250మి.గ్రా... కప్పు టీ 47మి.గ్రా.. డైట్ సోడా 45మిల్లీగ్రాముల కెఫిన్ కలిగి ఉన్నాయి. ఇక చాక్లెట్ ఎంత డార్క్‌గా ఉంటే అంత ఎక్కువ కెఫిన్ ఉంటుండగా.. చాక్లెట్ కవర్ కాఫీ బీన్స్‌లో 336మి.గ్రా. కెఫిన్ ఉంటుంది.

అయినా తల్లిదండ్రులు ఎందుకు అనుమతిస్తున్నారు?

చిన్న పిల్లలు కాఫీ వంటి కెఫిన్ కలిగిన పానీయాలను అడిగినప్పుడు ఇది ప్రారంభమవుతుంది. పేరెంట్స్ లేదా తమ కన్న పెద్దవారైన తోబుట్టువులు కాఫీ, టీలు తాగడం చూసి ఇంట్రెస్ట్ కలిగిన పిల్లలు కొంచెమైనా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంటారు. దీంతో ఒకటి లేదా రెండు సిప్‌లు తీసుకోవడానికి పెద్దలు అనుమతిస్తారు. కానీ ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే అది రెగ్యులర్ అయిపోతుందంటున్న నిపుణులు.. పిల్లలు ప్రమాదంతో పోరాడాలనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ షుగర్స్‌తో సమస్య

పిల్లలు కాఫీ తాగడం వల్ల మరో సమస్య.. అది తక్కువ పోషక విలువలు కలిగి ఉండటం. పాలు, నీరు వంటి పోషకాహారాలను రీప్లేస్ చేయడం. పాలు.. కాల్షియం, విటమిన్ డితో నిండి ఉంటుంది. నీరు ఒక పోషక పదార్థం. ఇదిలా ఉంటే కాఫీ కేవలం షుగర్ లేదా క్రీమ్ లంప్‌తో వచ్చే రోజులు పోయాయి. ఆ పానీయాన్ని మరింత అందంగా తీర్చిదిద్ది.. కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి కాఫీ షాప్స్. అదనపు చక్కెరలు, క్రీములు జోడిస్తుండటంతో.. కొవ్వు, కేలరీలు అధికంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఆర్టిఫియల్ షుగర్స్ ఎంచుకోవడం మూలంగా పిల్లలు ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్‌కు గురవుతున్నారు.


Next Story

Most Viewed