బెడ్ రూమ్‌లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటే ప్రమాదకరమా.. నిపుణులు ఏం చెప్తున్నారు?

by Disha Web Desk 7 |
బెడ్ రూమ్‌లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటే ప్రమాదకరమా.. నిపుణులు ఏం చెప్తున్నారు?
X

దిశ, ఫీచర్స్: బెడ్ రూమ్‌లో, ఇంటి ఆవరణలో చాలామంది ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇవి అందాన్ని, ఆకర్షణను పెంచుతాయని, స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని అందరికీ తెలిసిందే. కానీ వాటిని ఇంట్లో, ముఖ్యంగా బెడ్ రూంలో పెంచడంవల్ల ప్రమాదం కూడా పొంచి ఉంటుందనే వాదన కూడా ఉంది. ఎందుకంటే అవి రాత్రిపూట కార్బన్ డై ఆక్సైడ్‌ను రిలీజ్ చేయడంవల్ల ఊపిరాడని పరిస్థితికి దారి తీస్తాయని కొందరు చెప్తున్నారు. కానీ మానవుల అనుభవం, నిపుణుల అభిప్రాయం దీనిని కొట్టిపారేస్తున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ పెంచడంవల్ల ఏం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ చర్చిద్దాం.

''మొక్కలు, చెట్లు పగటిపూట కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని, ఆక్సీజన్‌ను రిలీజ్ చేస్తాయని, రాత్రిపూట మాత్రం ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్‌ను రిలీజ్ చేస్తాయని మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ కారణంగా కొందరు బెడ్ రూంలో మొక్కలు పెంచకూడదని, రాత్రిపూట చెట్ల కింద పడుకోవద్దని ఆలోచించడం మొదలు పెట్టారు. అయితే ఈ వాదనలో నిజమెంత అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి మొక్కలు ఇంటి ఆవరణలో, బెడ్ రూమ్‌లో పెంచకూడద అనేది అపోహ మాత్రమే.

దానివల్ల రిలీజ్ అయ్యే కార్బన్ డై ఆక్సైడ్ ఊపిరాడకుండా చేస్తుందనే వానద కరెక్ట్ కాదు. ఎందుకంటే రాత్రిపూట మొక్కలు లేదా చెట్లు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ (CO2) పరిమాణం మీ పక్కన ఉన్న ఒక వ్యక్తి శ్వాస తీసుకునే టైమ్‌లో రిలీజ్ అయ్యే దానికంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి భయం అవసరం లేదు. మీరు అడవిలో సంచరించవచ్చు లేదా మీ బెడ్ రూంలో మొక్కలను పెంచుకోవచ్చు'' అని ప్రము న్యూ ట్రిషనిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ భార్గవ తన ఇంస్టాగ్రామ్ వేదికగా వివరించారు.

మరో సీనియర్ కన్సల్టెంట్, పల్మనాలజిస్ట్ డాక్టర్ యూయూష్ గోయెల్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ''మొక్కలు ఇంటి ఆవరణలో లేదా బెడ్ రూంలో ఉండటం ఏమాత్రం ప్రమాదకరం కాదు. సురక్షితమే'' అన్నారు. పైగా ఇలా పెంచడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, అలోవెరా ప్లాంట్, రబ్బర్ ప్లాంట్ వంటివి ఇండ్లల్లో పెంచుకోవడానికి ఈరోజుల్లో బెస్ట్ ఆప్షన్‌. ఎందుకంటే ఇవి రాత్రిపూట కనీస మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి. దీనివల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ ఉండదు అని తెలిపారు. అవి తక్కువ పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి కాబట్టి ఆరోగ్యాన్ని పెద్దగా ప్రభావితం చేయవన్నారు.

అవేగనుక పెద్ద ఎత్తున కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తే తలనొప్పి, చంచలత్వం, మైకం వంటి రకాల లక్షణాలకు దారితీసేది కానీఅలా జరిగిన అనుభవాలు ఎవరికీ ఎదురు కావడం లేదని చెప్తున్నారు. అయితే మొక్కలు ఇంట్లో ఉన్నప్పుడు వెలుతురు, గాలి సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఫైనల్‌గా అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఇండోర్ ప్లాంట్స్ వల్ల ప్రమాదం లేదు. అవి రాత్రిపూట రిలీజ్ చసే కార్బన్ డై ఆక్సైడ్ ఒక వ్యక్తి బ్రీతింగ్ టైమ్‌లో సహజంగా విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం కంటే చాలా తక్కువ. వ్యక్తులు పక్క పక్కన ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదం కలగడం లేదు కదా. ఇండోర్ ప్లాంట్స్ కూడా అంతే. ఎవరైనా వాటిని ఇండ్లల్లో నిస్సందేహంగా పెంచుకోవచ్చు.


Next Story

Most Viewed