బట్టలు లేకుండా భార్య శృంగారానికి ఒప్పుకోకపోతే.. జరిగేది ఇదే..?

by Disha Web Desk |
బట్టలు లేకుండా భార్య శృంగారానికి ఒప్పుకోకపోతే.. జరిగేది ఇదే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : శృంగారం విషయంలో ఆలుమగలు ఎంత ఫ్రీగా ఉంటే వారి దాంపత్యం జీవితం అంత సాఫీగా సాగుతుందంట. పడక గదిలో ఒకరికి నచ్చినట్టు మరొకరు సహకరిస్తే సంసార నావ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శృంగారం సమయంలో భర్త ఒకలా, భార్య మరొకలా ఉంటే కుటుంబం విచ్ఛిన్నానికి దారి తీయడానికి కారణమయ్యే చాన్స్ ఉందంటున్నారు మానసిక నిపుణులు. ముఖ్యంగా పడక గదిలో పట్టింపులకు పోతే ఆ గదిలోకి మరొకరు ఎంట్రీ ఇస్తారని ఫ్యామిలీ కౌన్సిలర్లు చెబుతున్నారు.


పెళ్లైన కొత్తలో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు నవ దంపతులు. ఆ తర్వాత కాలం గడిచే కొద్ది దానిపై కాస్తా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇద్దరికి సెక్స్‌పై ఇంట్రెస్ట్ లేకపోతే సమస్య లేదుకానీ.. ఒకరికి ఉండి మరొకరికి అయిష్టత ఉంటే మాత్రం సమస్యలకు బెడ్ రూమే నాంది పలుకుతుందంట. ముఖ్యంగా భర్తల ఇష్టాలను భార్యలు అంతగా పట్టించుకోరని ఫ్యామిలీ కౌన్సిలర్ల మాట. భర్త అడిగిన విధంగా శృంగారానికి సహకరించకపోవడం, అసలు ఆ పనికే అడ్డు చెప్పడంలాంటివి చేస్తారట. కొంత మంది శృంగారం సమయంలో నగ్నంగా ఉండాలని కోరుకుంటారట. కానీ భార్యలు అందుకు నిరాకరించడం.. మరి కొంత మంది కనీసం తమ ప్రైవేట్ పార్ట్‌‌ను కూడా దాస్తూ భర్త మూడ్‌ను పట్టించుకోరట. అయితే ఇలా చేయడం ప్రమాదమేనని ఫ్యామిలీ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు.


పడక గదిలో భార్య సహకరించపోయినా, భర్త సహకరించపోయినా కోరికలను అదుపు చేసుకోలేక అక్రమ సంబంధాలు పెట్టుకునే ఛాన్స్ ఉందని ఫ్యామిలీ కౌన్సిలర్లు చెబుతున్నారు. తమ దగ్గరకు వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది ఇలాంటి వివాదాలతో వస్తుంటారని ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ పద్మా కమలాకర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే శృంగారం సమయంలో బట్టలు లేకుండా పాల్గొంటేనే ఆలుమగలు మధ్య బంధం బలపడుతుందని, సెక్స్ విషయంలో ఎంత దాపరికం లేకుండా ఉంటే అంత బాగుంటుందని చెబుతున్నారు. లేకపోతే పరాయి పురుషుడో, మహిళనో బెడ్ రూంలో దూరడానికి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. కొంత మంది భర్తలు సెక్స్ గురించి భార్యల దగ్గల నోరు విప్పకుండా పరాయి స్త్రీల వద్ద గలగల మాట్లాడుతుంటారు. కానీ అదే భార్య వద్ద మాట్లాడితే ఒకరి ఇష్టం మరొకరు తెలుసుకుని పడక గదిలో మనస్పర్ధాలు రాకుండా ఉంటుందంట.

సెక్స్ కోసమే ఎనిమిదేళ్లు వాడుకుని వదిలేశాడు: సల్మాన్‌పై నటి ఆరోపణ

ఆ ప్రమాదకర సమస్యతో బాధపడుతున్న హాట్ బ్యూటీ



Next Story