ట్రెండ్ అవుతున్న హస్బెండ్ టెస్ట్.. ఇలా పిలిస్తే మీ లవర్ గురించి తెలిసిపోతుంది!

by Disha Web Desk 8 |
ట్రెండ్ అవుతున్న హస్బెండ్ టెస్ట్.. ఇలా పిలిస్తే  మీ లవర్ గురించి తెలిసిపోతుంది!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉందా అంటే అది హస్బెండ్ టెస్ట్. ప్రేమ అనేది చాలా కామన్. ఇద్దరి వ్యక్తుల మనసు కలిసిందంటే అది ప్రేమగా మారుతుంది. చాలా మంది తమ భాగస్వామితో ఆనందంగా ఉండాలి అనుకుంటారు. అయితే కొంత మంది ఫేక్ రిలేషన్, ఫేక్ ప్రేమను చూపిస్తే మరికొందరు మాత్రం తమ రిలేషన్ పట్ల నిజాయితీగా ఉంటారు. కానీ ఫేక్ ప్రేమను గుర్తించడం చాలా కష్టం. దాని నుంచి బయటపడటానికే ప్రస్తుతం నెట్టింట్లో ఓ న్యూస్ సర్క్యూలేట్ అవుతుంది. అది ఏమిటంటే? రిలేషన్ షిప్ టెస్ట్.

చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న వారు, ఇప్పుడిప్పుడే ప్రేమలో పడిన వారు ఎవరైనా సరే, తమ ప్రియుడిని ఈ టెస్ట్ చేయొచ్చు. అయితే ఇది ఎలా చేయాలంటే? తమ ప్రియుడికి కాల్ చేసి.. కాల్ రికార్డింగ్ పెట్టుకోవాలి. అప్పుడు మీరు మాట్లాడుతూ.. సరదాగా భర్త అని పిలవాలి. దానికి వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేదే ఈ టెస్ట్. ఒక వారు నవ్వుతూ సంతోషంగా స్పందిస్తే వారిది ట్రూ లవ్..కొంత మంది అలా పిలవకూడదు అని చెప్పడం లేదా? సీరియస్‌గా రియాక్ట్ అయ్యారంటే వారు మీతో నటిస్తున్నట్లే నంట. అంతే కాకుండా వారు మీ నుంచి త్వరలోనే విడిపోతారు.. ఏదో మీతో కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నట్లే అర్థం అంటున్నారు నిపుణులు. ఇక ప్రస్తుతం ఈ టెస్ట్ చాలా మంది చేస్తున్నారు. దీంతో ఇది చాలా ట్రెండ్ అవుతుంది.

ఇది ఎక్కడ మొదలైంది?

అయితే ఈ టెస్ట్ అనేది మొదటగా విదేశాల్లో మొదలైందంట. ఓ యువతి తన ప్రియుడికి ఫోన్ చేసి భర్త అని పిలుస్తుంది. దీంతో అతను స్పందించిన విధానాన్ని రికార్డ్ చేసి పదే పదే వింటుంది. అతను నేను నీ భర్తను కాదు అని చెప్పడంతో ఆయనది ట్రూ లవ్ కాదు అని భావించి ఆ వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. దీంతో ఇది వైరల్ అవుతోంది.

Next Story