మనిషి మూత్రం పెట్రోల్ కన్నా ఖరీదు కాబోతుందంట..?

by Dishanational1 |
మనిషి మూత్రం పెట్రోల్ కన్నా ఖరీదు కాబోతుందంట..?
X

దిశ, వెబ్ డెస్క్: ఇక మానవ మూత్రం పెట్రోల్ కన్నా ఖరీదు కాబోతోంది తెలుసా?... ఈ మాట వినగానే షాకవుతున్నారా? అయితే, ఇది నిజం కాబోతోందంట. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని చెబుతున్నారు. ప్రపంచంలో లభ్యమయ్యే ప్రతి పదార్థం ఉపయోగకరమే. ప్రతి ఒక్కదానికి ఓ ప్రత్యేకత ఉంటది. ఈ విషయాన్ని గ్రహించిన శాస్త్రవేత్తలు మానవ మూత్రాన్ని ఎరువుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు. మానవ మూత్రం సేంద్రీయ ఎరువుగా మాత్రమే పనిచేయడమేకాకుండా వ్యవసాయ ఉత్పత్తిలో ఉపయోగించే రసాయనంగా మారి పర్యావరణ కాలుష్యం, నియంత్రణ అవుతుందని కూడా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ వెబ్ సైట్ ఫ్రాన్స్ 24 దీనికి సంబంధించి సవివరమైన వివరాలు అందులో పేర్కొన్నది. మొక్కలకు అవసరమైన నత్రజని, బాస్వరం, పోటాషియం.. ఈ మూడు మూలకాలు మనం తినే ఆహారం ద్వారా మన కడుపులోకి చేరుతాయి. ఆ తర్వాత అవి మూత్రం నుంచి బయటకు వస్తాయి. ఇలా బయటకు వచ్చిన మూత్రంతో పొలాల్లో వ్యవసాయానికి చాలా కాలంపాటు పోషణ అంది ఉత్పత్తి మెరుగుపడుతుంది. దీంతో అవసరమైన ఆహారం లభిస్తుంది. రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించాలంటే మనిషి మూత్రంతో ప్రయోగాలు చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది ఒక ఉద్యమంగా మారి ఈ పరిశోధన ఊపందుకుంటే మానవ మూత్రం పెట్రోల్ కన్నా ఖరీదు కావొచ్చని చెబుతున్నారు.


Next Story

Most Viewed