ఏఐతో మానవ మనుగడకే ముప్పు..పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి!

by Disha Web Desk 8 |
ఏఐతో మానవ మనుగడకే ముప్పు..పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి!
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు టెక్నాలజీ పరుగులు పెడుతోంది.మానవుని ఊహకు కూడా అదని ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. మానవుడి అవసరమే లేకుండా పనిచేసే యంత్రాలు రోజుకొకటి వస్తుంది. ఇక ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో, ప్రజలు కాస్త భయాందోళనకు గురి అవుతున్నారు.

ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనివైపే చూస్తుంది.దీని వలన నష్టాలేంటి, లాభాలు ఏంటీ అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పరిశోధకులు ఏఐ వలన భవిష్యత్తులో నష్టం ఎక్కువగా ఉందా? లాభం ఉందా అని పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రఖ్యాత ఏఐ భద్రతా నిపుణులు డాక్టర్ రోమన్ వీ యాంపోలిస్కీ తన రాబోయే పుస్తకంలో ఏఐ వలన కలిగే నష్టాలను వివరించారు.

ముఖ్యంగా ఏఐను నియంత్రించే అవకాశం మానవులకు ఉండదని, అదే జరిగితే మానవ మనుగడకే ఏఐ వల్ల ముప్పు సంభవిస్తుందని పేర్కొంటున్నారు. డాక్టర్ యాంపోలిస్కీ తన ఐ అన్ఎక్స్‌పాండబుల్, అన్ ప్రిడిక్టబుల్, అన్ కంట్రోలబుల్ అనే పుస్తకంలో ఏఐను మనం నియంత్రించగలమనే కచ్చితమైన రుజువు లేదని,ఇది అస్తిత్వ ముప్పు” అది అతి పెద్ద వినాశాలకు దారి తీసే అవకాశం ఎక్కువ ఉందని, ఇది మానవుని మనుగడకే పెద్ద ముప్పని పేర్కొన్నారు

.

అలాగే ఈ పుస్తకంలో ఏఐకు సంబంధించిన స్వయంప్రతిపత్తి, అనూహ్యత ద్వారా ఎదురయ్యే స్వాభావిక సవాళ్లను వివరించారు. ఈ ఫీచర్లు అపారమైన సామర్థ్యాన్ని అందిస్తున్నప్పుడు ఏఐ మానవ నియంత్రణలో ఉందని నిర్ధారించడం కష్టతరం చేస్తుందని పేర్కొంటున్నారు. డాక్టర్ యాంపోలిస్కీ సందేశం స్పష్టంగా, అత్యవసరంగా ఉందని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బలమైన ఏఐ భద్రతా చర్యలను అభివృద్ధి చేయాలని కూడా సూచిస్తున్నారు.



Next Story

Most Viewed