పశ్చిమోత్తనాసనం (రెండో పద్ధతి) ఎలా చేయాలి?.. ప్రయోజనాలు:

by Disha Web Desk 7 |
పశ్చిమోత్తనాసనం (రెండో పద్ధతి) ఎలా చేయాలి?.. ప్రయోజనాలు:
X

దిశ, ఫీచర్స్: మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ పొట్టను తొడలపై, తలను మోకాళ్లపై ఆన్చాలి. ఇప్పుడు రెండు చేతులను వెనకకు ఫోల్డ్ చేస్తూ ఆకాశంవైపు చూపించాలి. తర్వాత రెండు అరచేతులను జతచేసి వేళ్లను కలిపి బలంగా చేతులను పైకి లాగుతుండాలి. ఈ భంగిమలో కాళ్లు, నడుము, చేతులు నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

ప్రయోజనాలు:

* రుతుక్రమ అసౌకర్యం నుంచి ఉపశమనం.

* రక్త ప్రవాహాన్ని పెంచి, ఆందోళన తగ్గిస్తుంది.

* రాత్రిపూట హాయిగా నిద్రించేలా చేస్తుంది.

* హామ్ స్ట్రింగ్స్‌ను చక్కగా సాగదీస్తుంది.

* బొడ్డు చుట్టున్న కొవ్వును కరగదీస్తుంది.

* జీర్ణక్రియ పనితీరు మెరుగుపరుస్తుంది.



Next Story

Most Viewed