Health tips: అర్ధ పద్మ పశ్చిమోత్తనాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?

by Disha Web Desk 16 |
Health tips: అర్ధ పద్మ పశ్చిమోత్తనాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?
X

దిశ,పీచర్స్ :

అర్ధ పద్మ పశ్చిమోత్తనాసనం :

మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత కుడికాలి పాదాన్ని ఎడమ తొడపై పొట్టకు దగ్గరగా పెట్టాలి. ఇప్పుడు శరీరాన్ని ముందుకు వంచుతూ పొట్ట కుడికాలిపై ఉండేలా చూసుకోవాలి. తలను ఎడమకాలి మోకాలుకు దగ్గరగా కిందకు వంచాలి. తర్వాత కుడి చేతిని వీపు వెనకాలనుంచి తీసుకెళ్లి కుడి కాలి బొటనవేలిని పట్టుకోవాలి. ఎడమ చేతితో ఎడమకాలి బొటన వేలును పట్టుకోవాలి. ఈ భంగిమలో ఎడమకాలు, వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి ఎడమకాలు మడిచి చేయాలి.

ప్రయోజనాలు:

* మోకాలి కీళ్ల వశ్యతను పెంచుతుంది.

* భుజం కీళ్లను సాగదీస్తుంది.

* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

* వెనుక కండరాలను సాగదీస్తుంది

* వెన్నెముక నరాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.

సెప్టెంబర్ 26న బధిరుల దినోత్సవం


Next Story

Most Viewed