అర్ధ చంద్రాసనం ఎలా చేయాలి?.. ప్రయోజనాలు..

by Disha Web Desk 7 |
అర్ధ చంద్రాసనం ఎలా చేయాలి?.. ప్రయోజనాలు..
X

మొదటగా బల్లపరుపు నేలపై నిలబడి రిలాక్స్ అవ్వాలి. తర్వాత రెండు కాళ్లను రెండు ఫీట్ల దూరం జరిపి పాదాలను కుడివైపుకు తిప్పాలి. ఇప్పుడు శరీరాన్ని కుడివైపుకు తిప్పి కుడిమోకాలు మడిచి ఎడమ మోకాలు నేలపై పెట్టాలి. రెండు చేతులను ముందువైపు నేలపై ఆన్చాలి. తర్వాత నెమ్మదిగా ఎడమకాలిని గాల్లోకి లేపుతూ కుడిమోకాలును నిటారుగా చేయాలి. కుడి అరచేతిని కుడి పాదానికి సూటిగా నేలపై ఆన్చి ఎడమ చేతిని ఆకాశంవైపు చూపించాలి. ఈ భంగిమలో రెండు కాళ్లు '7' ఆకారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగిన తర్వాత కాలు మార్చి చేయాలి.

ప్రయోజనాలు:

* వెన్నునొప్పిని తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.

* కాళ్లు, వెన్నెముక కండరాలను బలోపేతం చేస్తుంది.

* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

* ఆందోళన, డిప్రెషన్ తగ్గిస్తుంది.

* సమతుల్యత, సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.

* హామ్ స్ట్రింగ్స్, ఛాతీ, తుంటిని తెరుస్తుంది.


Next Story

Most Viewed