ఒక్క కౌగిలింతలో ఎన్ని భావాలో.. శృంగారానికి తొలి మెట్టు అదే..

by Disha Web Desk 23 |
ఒక్క కౌగిలింతలో ఎన్ని భావాలో.. శృంగారానికి తొలి మెట్టు అదే..
X

దిశ,వెబ్‌డెస్క్: కౌగిలింత అనేది ఓ ప్రత్యేకమైన భాష. భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఇది గొప్ప మార్గం. క్షమించమని అడగడానికైనా, ప్రేమను వ్యక్తపరచడానికైనా కౌగిలింతే సరైన వారధి. ఉరుకులు, పరుగుల నేటి జీవితంలో భాగస్వామితో దృఢమైన అనుబంధం పెంచుకోవాలంటే హగ్‌ను మించిన ఆయుధం మరొకటి లేదు. శృంగారానికి తొలి మెట్టు కౌగిలింతే. ఈ క్రమంలో రిలీజ్ అయ్యే హార్మోన్లు శరీరాన్ని శృంగారానికి సిద్ధం చేస్తాయని చెప్తుండగా.. ఒక్క కౌగిలితంలో ఎన్ని భావాలు, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది? ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుంది? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

* మీరు మీ జీవిత భాగస్వామిని కౌగిలించుకున్న వెంటనే ఆమె/అతని శరీరంలో ఆక్సిటోసిన్‌ విడుదలవుతుంది. అది మనిషి మూడ్‌ మీద ప్రభావం చూపిస్తుంది. కోపం, ఒంటరిగా ఉన్నామనే భావనను తగ్గిస్తుంది.

* రోజులో ఎక్కువ సార్లు కౌగిలించుకోవడం వల్ల సెరిటోనిన్‌ విడుదలవుతుంది. ఇది శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.

* కౌగిలించుకోవడం వల్ల శరీరంలో రక్తం, ఆక్సిజన్ ప్రసరణ పెరుగుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. మీ అలసటను దూరం చేస్తుంది. దీంతో పాటు శరీర పనితీరు మెరుగవుతుంది.

* మూడ్ మెరుగ్గా ఉంటుంది. మీరు సాధారణ మూడ్‌లో ఉన్నప్పటికీ సన్నిహిత వ్యక్తి మిమ్మల్ని కౌగిలించుకుంటే మీ మానసిక స్థితి చాలా రెట్లు మెరుగవుతుంది. అందుకే ప్రతిరోజూ మీ ప్రియమైన వారిని కౌగిలించుకోవాలి.

* తరచుగా కౌగిలించుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఎందుకంటే వారు సంతోషంగా, రిలాక్స్‌గా ఉంటారు. తద్వారా మనస్సుపై సానుకూల ప్రభావం ఉంటుంది. దీని కారణంగా బ్రెయిన్‌ మునుపటి కంటే షార్ప్‌గా పనిచేస్తుంది.

* కౌగిలించుకోవడం వల్ల శరీరంలో రక్తం, ఆక్సిజన్ ప్రసరణ పెరుగుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. మీ అలసటను దూరం చేస్తుంది. దీంతో పాటు శరీర పనితీరు మెరుగవుతుంది.

* క్షమించమని మీ జీవిత భాగస్వామిని అడగడానికి అహం అడ్డు వచ్చినపుడు. కౌగిలింతనే ఆశ్రయించడం మంచిది.

* కౌగిలింత మన భాగస్వామికి ధైర్యాన్నిస్తుంది. నేను ఉన్నాననే భరోసా కల్పిస్తుంది. కాబట్టి భాగస్వామిని రోజూ వీలైనన్ని సార్లు కౌగిలించుకుని మీ వివాహ బంధాన్ని పటిష్ట పరచుకోండి.

Also Read...

గుండెపోటును అంచనా వేస్తున్న హెయిర్

‘ఇ- స్కిన్’ను డెవలప్ చేసిన పరిశోధకులు.. అచ్చం మానవ చర్మంలాగే పనిచేస్తుందట!

Next Story