- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Honey Benefits : తేనె మాత్రమే కాదు.. తేనె తుట్టెతోనూ బోలెడు ప్రయోజనాలు!
దిశ, ఫీచర్స్ : తేనె.. ఈ పేరు వింటేనే అది ఎంత తీయగా ఉంటుందో గుర్తుకు వస్తుంది. ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన పోషకాలు కలిగిన వాటిలో ఇదొకటి. ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు, పెద్దలు చెప్తుంటారు. అయితే తేనె తయారు కావడానికి ప్రధాన కారణం తేనెటీగలు, అంతకుముందు తేనెతుట్టె వాటి ఆవాసంగా ఉంటుంది. ఇక్కడ నివసిస్తూ తేనెటీగలు తమ శరీరం నుంచి విసర్జించే పదార్థమే తేనెగా మారుతుంది. తేనె ఉపయోగాల గురించి చాలా మందికి తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో తేనె కన్నా తేనె తుట్టెకే డిమాండ్ ఎక్కువ అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
బీస్ వ్యాక్స్
తేనెతుట్టె వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో మైనం ఉంటుంది. దీనినే బీస్ వ్యాక్స్ అంటారు. అయితే దీనిని కొద్దిగా ప్రాసెస్ చేసి వాడుకునే విధంగా తయారు చేస్తారట. కొవ్వొత్తలు, బ్యూటీ ప్రొడక్ట్స్, మాయిశ్చరైజర్లు, కాస్మోటిక్స్, సబ్బులు వంటి వాటి తయారీలోనూ ఉపయోగిస్తారు. అంతేకాకుండా గీతలు పడి, పాతగా అనిపించే ఫర్నీచర్‌ను కొత్తగా మార్చడంలో ఈ తేనెతుట్టెలోని మైనం ద్వారా తయారు చేసిన బీస్ వ్యాక్స్ ఉపయోగిస్తారు. లెదర్‌తో యారు చేసిన వస్తువులను భద్రపర్చేందుకు తయారు చేసే వాటర్ ప్రూఫ్ కోటింగ్ బ్యాగుల తయారీలో కూడా తేనెతుట్టెలోని మైనం ఉపయోగిస్తారట. అందుకే తేనె తుట్టె ధర వాస్తవానికి తేనెకన్నా అధికంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
తినే పదార్థాల్లో కూడా..
తేనె మాత్రమే కాదు, తేనె తుట్టెను కూడా తింటారు కొందరు. రుచిగా కూడా ఉంటుంది. అలాగే టోస్టులు, బ్రెడ్, కేక్, ఐస్ క్రీమ్, గులాబ్ జామూన్ల వంటి స్వీట్ల మాదిరే తేనెతుట్టెను తినడానికి ఉపయోగిస్తారు. సలాడ్లు, స్మూతీలలో దీని ముక్కలను కలుపుకొని తాగుతారు. అలాగే విదేశాల్లో చీజ్, బీస్ వ్యాక్స్ కలిపి తినేవారు ఎక్కువగా ఉంటారు.
చూయింగ్ గమ్ తయారీలో..
తేనెతుట్టెను చూయింగ్ గమ్ మాదిరి నమిలి తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. కొన్నిసార్లు చూయింగ్ గమ్ తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. తేనె తుట్టెను నమిలే కొద్దీ అందులో నుంచి తేనె వస్తూ నోటికి రుచిగా అనిపిస్తుంది. కాగా తేనె మాత్రమే మింగి, తర్వాత నోట్లో మిగిలిపోయిన మైనంను చూయింగ్ గమ్ లాగానే ఉమ్మివేయవచ్చు.
ఎవరు తినకూడదు?
తేనెతుట్టెలో చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి తినడంవల్ల ప్రమాదం ఏమీ లేదు. అయితే మైనంలా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలు, గర్భిణులు తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీరిలో కడుపు నొప్పి, ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చిన్నారులు, గర్భిణులు తేనె తుట్టెకు బదులు తేనె తినడం మాత్రం మంచిది అంటున్నారు నిపుణులు.