చరిత్రలో మానసిక ఆరోగ్యంతో పోరాడిన గ్రేట్ మైండర్స్

by Disha Web Desk 6 |
చరిత్రలో మానసిక ఆరోగ్యంతో పోరాడిన గ్రేట్ మైండర్స్
X

దిశ, ఫీచర్స్: గొప్ప గొప్ప మేధావులంతా తరగతి గదుల్లోంచి పుట్టుకొస్తారనేది ఒక సామెత. అలాగే గొప్ప గొప్ప మేధావులు, తత్వవేత్తలు వ్యక్తిగత జీవితంలో మానసిక ఆరోగ్య సమస్యలతోనూ పోరాడారని చరిత్ర చెబుతోంది. వాస్తవానికి మేధావి కూడా స్థిరత్వంతో సమానం కాదు కాబట్టి.. తరచుగా అనారోగ్యం, విషాదం, అకాల మరణం వంటివి ఎదుర్కొన్నవారు చాలా మంది కనిపిస్తారు. భ్రాంతి, ద్రోహం, మానసిక ఆరోగ్యంతో పోరాడటం లేదా తమ కాలానికి చాలా తీవ్రమైన ఆలోచనలు కలిగి ఉండటంవల్ల చరిత్రలో అనేక మంది మేధావులు విరామం పొందలేకపోయారు. అలాంటి వారి గురించి తెలుసుకుందాం.

అలెగ్జాండర్ ది గ్రేట్

నిస్సందేహంగా చరిత్రలో ఏకైక గొప్ప మిలిటరీ మైండ్ కలిగిన మేధావి అలెగ్జాండర్ ది గ్రేట్. ఇతను మాసిడోనియా కింగ్ కూడాను. పాలనలో ఎక్కువ భాగం తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికాలోని వివిధ ప్రదేశాలను జయించటానికే ఇంట్రెస్ట్ చూపుతూ గడిపాడు. దీంతో అపఖ్యాతి పాలైన మతిస్థిమితం లేని మెగాలోమానియాక్‌గా కూడా ప్రసిద్ధి చెందాడు. అయితే అతను చిన్నప్పటి నుంచి జ్యూస్ ప్రత్యక్ష వారసుడినని నమ్మాడు. విమర్శలను సహించేవాడు కాదు. సక్సెస్ సెల్రబేషన్లలో కొంచెం ఎక్కువ వైన్ తాగిన తర్వాత, అలెగ్జాండర్ తన బెస్ట్ ఫ్రెండ్, అడ్వైజర్ క్లీటస్ ది బ్లాక్‌తో గొడవ పడేవాడు.

లుడ్‌విగ్ వాన్ బీథోవెన్

లుడ్‌విగ్ వాన్ బీథోవెన్‌ను చాలా మంది అత్యుత్తమ శాస్త్రీయ స్వరకర్తగా పేర్కొంటారు. కానీ ఆయన అనేక శారీరక లోపాలతో బాధపడ్డాడు. ముఖ్యంగా పూర్తి చెవుడు, బోన్ పేజెట్ వ్యాధితో అవస్థలు పడ్డాడు. కొంతమంది ఆధునిక మనస్తత్వవేత్తల ప్రకారం.. ఇతను బైపోలార్ డిజార్డర్‌తో బాధపడి ఉండవచ్చు. బీథోవెన్ చాలా రోజుల పాటు మానిక్ ఎపిసోడ్‌ల సమయంలో పిచ్చి వేగంతో సంగీతాన్ని స్వరపర్చేవాడు. అతను కొన్నిసార్లు తిండి, నిద్ర లేకుండా గడిపేవాడు. తన ఫ్రెండ్స్ గురించి వర్రీ అయ్యేవాడు. ఈ విధమైన విస్ఫోటనాల తర్వాత ఈ స్వరకర్త క్రానిక్ డిప్రెషన్‌కు గురై వారాల తరబడి ఒక్క నోట్ కూడా రాయలేకపోయేవాడు.

సోక్రటీస్

చరిత్రలో గొప్ప మేధావి. అత్యంత ముఖ్యమైన ఆలోచనాపరులలో ఒకడిగా పరిగణిస్తారు. తన జీవితకాలంలో చాలా మంది ద్వారా ద్వేషించబడ్డాడు. పురాతన గ్రీస్‌లో అతని ఆలోచనలను, నమ్మకాలను చాలా మంది అసహ్యించుకున్నారు. సోక్రటీస్ ఒక రకమైన సంగీతంతో కూడిన వాయిస్‌ను రోజూ వినేవాడు. దానిని తన ‘డీమన్’ అని పేర్కొనేవాడట. ఈ స్వరం ఫేమస్ ఫిలాసఫర్‌ను హింసాత్మక ధోరణుల వైపు నడిపించనప్పటికీ, అది తనకు ఎప్పటికప్పుడు అడ్వైస్ ఇచ్చిందని సోక్రటీస్ భావించేవాడు. అంతేగాక తనను పొలిటీషియన్‌గా ‘డీమన్’ సంగీతం అడ్డకుందని చెప్పేవాడట.

చార్లెస్ డార్విన్

ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ చార్లెస్ డార్విన్ తన జీవితాంతం అనేక శారీరక సమస్యలతో బాధపడ్డాడు. దీర్ఘకాలిక కడుపు నొప్పి, గుండె దడతోపాటు తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాడు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ డార్విన్ పూర్తి అర్థవంతమైన జీవితాన్ని గడపగలిగాడు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించాడు. ఎప్పటికప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ థియరీస్‌‌లలో ఒకదాన్ని పరిచయం చేశాడు.

పైథాగరస్

పైథాగరస్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో పేరుగాంచిన మేధావి పైథాగరస్‌కు కొన్ని విపరీతమైన ఇతర ఆలోచనలు, సిద్ధాంతాలు ఉండేవి. ఒక విప్లవాత్మక గణిత శాస్త్రజ్ఞుడిగానే కాకుండా, పైథాగరస్ కల్ట్ నాయకత్వంలో కూడా పనిచేశాడు. పైథాగరియన్స్ అని పిలవబడే గ్రూప్ 10 సంఖ్యను ఆరాధించాడు. దానికి అంకితమైన ప్రార్థన కూడా చేశాడు. పైథాగరస్ డెమి-గాడ్ అని కూడా విశ్వసించాడు. ఇతని విపరీతమైన నమ్మకాలలో ఒకటి ఏంటంటే.. ఫావా బీన్స్ తినడం తప్పు, ఎందుకంటే వాటిలో చనిపోయిన వారి ఆత్మలు ఉంటాయని నమ్మేవాడు. అతను చివరికి ఫావా బీన్స్ ఫీల్డ్‌ను రక్షించడానికి తన ప్రాణాలను వదులుకున్నాడు.

విన్ స్టన్ చర్చిల్

యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధాన మంత్రి విన్ స్టన్ చర్చిల్. రెండవ ప్రపంచ యుద్ధంలో తన ప్రతిభతో ప్రసిద్ధి చెందాడు. వరల్డ్ వార్‌లో ఉన్నప్పుడు ఇతను వ్యక్తిగత సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. తనలోని ప్రాబ్లమ్స్‌ను ‘బ్లాక్ డాగ్’‌గా పేర్కొన్నాడు. తనలోని నెగెటివ్ ఫీలింగ్స్‌ను ఎదుర్కోవటానికి జీవితాంతం తాగుడుకు బానిసయ్యాడు. ‘a second’s action would end everything’ అని ఆందోళన చెందుతూ గడిపాడు.

ఎర్నెస్ట్ హెమింగ్‌వే

ఎర్నెస్ట్ హెమింగ్‌వే ‘ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ’, ‘ఎ ఫేర్‌వెల్ టు ఆర్మ్స్’ వంటి గొప్ప క్లాసిక్‌ నవలలు రాసిన రచయిత. ఇతను డిప్రెషన్‌తో తాగుడుకు బానిసై.. జీవితాంతం ఆ వ్యసనంతో పోరాడాడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కుటుంబంతో సంబంధాలు తెగిపోవడం తన ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపింది. దీంతో జీవితం చివరి అంకంలో మతిస్థిమితం కోల్పోయాడు. తను FBI ద్వారా పర్యవేక్షించబడుతున్నట్లు భ్రాంతికి లోనయ్యేవాడు. చివరికి తనను తాను ఒంటరిగా చేసుకోవడం ప్రారంభించాడు. 61 సంవత్సరాల వయస్సులో తనను తాను షూట్ చేసుకొని చనిపోయాడు.

ఇవి కూడా చదవండి :

జారిపడే వాన చినుకు వేగం ఎంతంటే ?

Next Story

Most Viewed