కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

by Disha Web Desk 10 |
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు దినచర్యలో మార్పులు, ఆహారపు అలవాట్ల వల్ల పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుతుతూ డబ్బు వృథా చేసుకుంటున్నారు. అయితే కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. వంటల్లో వెల్లుల్లిని విరివిగా వాడుతుంటాం. మసాలాల్లో, పోపుల్లో ఉపయోగిస్తాం. దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చాలా మందికి తెలిసినప్పటికీ, తినకుండా తీసి పక్కన పెట్టేస్తారు. కానీ వెల్లుల్లితో ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

* కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచడంలో వెల్లుల్లి తోడ్పడుతుంది. ఇంకా చెప్పాలంటే రక్తం గడ్డ కట్టకుండా చేయడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే కాల్చిన వెల్లుల్లి తీసుకోవడం వల్ల చుండ్రు, తెల్ల వెంట్రుకల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

* అధిక బరువుతో బాధపడేవారు కాల్చిన వెల్లుల్లి తినడం మంచిది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్‌ను కూడా పెంచుతుంది. అలసట లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇక నూనె లేకుండా డ్రైగా కాల్చిన వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల బాడీ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా సహాయపడుతుంది.

* లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్న పురుషులు కాల్చిన వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే, పురుష సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ స్థాయి మెరుగుపడుతుంది. దీనివల్ల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్కలనం, అనేక ఇతర లైంగిక సంబంధిత సమస్యలకు, వేయించిన వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. అలాగే స్పెర్మ్ నాణ్యతను కూడా పెంచుతుంది.

* పంటి నొప్పి సమస్యతో బాధపడేవారు, వెల్లుల్లిని పచ్చిగా రుబ్బుకుని దంతాల మీద పెట్టుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల దంతాల మీద ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది.

* కాల్చిన వెల్లుల్లి క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది. అనేక రకాల క్యాన్సర్లతో పోరాడటంలో సహాయపడుతుంది. ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

* ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి వంటి జీర్ణ సమస్యలు ఉంటే, కాల్చిన వెల్లుల్లి తినడం తప్పనిసరి. ఎందుకంటే ఇది గుండెల్లో మంట, వికారం, కడుపు నొప్పిని నయం చేస్తుంది.

Next Story