బీటెక్ ఫెయిల్ అయ్యారా.. చక్కగా నాలుగు గాడిదలు కొనుక్కోండి.. ఏడాది తిరిగే లోపు కోటీశ్వరులు అయిపోవచ్చు..

by Dishafeatures3 |
బీటెక్ ఫెయిల్ అయ్యారా.. చక్కగా నాలుగు గాడిదలు కొనుక్కోండి.. ఏడాది తిరిగే లోపు కోటీశ్వరులు అయిపోవచ్చు..
X

దిశ, ఫీచర్స్: బీటెక్ ఫెయిల్ అయితే నాలుగు గాడిదలు కొనిస్తా అని నాన్న భయపెడుతూనే ఉంటాడు. కచ్చితంగా పాస్ కావాలని గాడిద పేరు చెప్పి పిచ్చి తిట్లు తిడుతాడు. దీంతో మనం భయపడిపోతం. బాగా చదువుకోవాలని, కచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోవాలని అనుకుంటాం. కానీ ఒక వేళ ఫెయిల్ అయితే.. నిజంగానే నాన్న గాడిదలు కొనిస్తే.. మీరు ఏడాది తిరిగే లోపే కోటీశ్వరులు అయిపోవచ్చు. అదెలా అనుకుంటున్నారా అయితే గుజరాత్ కు చెందిన ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ తెలుసుకోవాల్సిందే.

గవర్నమెంట్ జాబ్ ప్రయత్నించిన ధీరెన్ సోలంకి విసిగిపోయాడు. ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో ఓ ప్రైవేట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. కానీ వచ్చే జీతం కుటుంబ అవసరాలను తీర్చకపోగా అప్పుల పాలయ్యాడు. అదే టైంలో సౌత్ ఇండియాలో గాడిద పాలకు ఉన్న డిమాండ్ తెలుసుకుని.. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ప్రయత్నించాడు. రూ. 22లక్షల ఇన్వెస్ట్మెంట్ తో 20 గాడిదలు కొని ఫార్మ్ సెట్ చేశాడు. పాలు అమ్ముతున్నాడు. కాగా ఈ మిల్క్ ఆవు పాల కన్నా దాదాపు 70 రెట్లు అధిక ధర పలుకుతుండటం.. జబ్బులను నయం చేస్తుందనే సైంటిఫిక్ ప్రూఫ్, నమ్మకం ఉండటం.. ఆయనకు కలిసొచ్చింది. దీంతో ఒక్క లీటరు గాడిద పాలను రూ. 5000 కు అమ్ముతూ ఏడాదికి రూ. 2.5 కోట్లకుపైనే సంపాదిస్తున్నాడు.

కాగా వ్యాపారం ప్రారంభించిన మొదటి ఐదు నెలలు కొద్దిగా కష్టపడినా.. గుజరాత్ నుంచి వ్యాపారాన్ని సౌత్ ఇండియాకు మార్చేసి మంచి లాభాలు గడించినట్లు తెలుస్తుంది. ఇక మీరు కూడా ఈ గాడిద పాలు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే tdsdonkeyfarm.in వెబ్ సైట్ ఓపెన్ చేసి పూర్తి డీటెయిల్స్ చెక్ చేయండి.



Next Story

Most Viewed