పచ్చళ్లు బూజు పట్టకుండా ఉండాలంటే ఈ ట్రిక్స్ తెలిస్తే చాలు

by Anjali |   ( Updated:2024-10-02 09:30:51.0  )
పచ్చళ్లు బూజు పట్టకుండా ఉండాలంటే ఈ ట్రిక్స్ తెలిస్తే చాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో తయారు చేసే పచ్చళ్లు(మామిడి, టమాటా, చింతకాయ, నిమ్మకాయ)ఎంతో రుచిగా ఉంటాయి. సమయానికి కర్రీ లేకపోతే వెంటనే నిల్వ ఉన్న పచ్చడిని అన్నంలో వేసుకుని తింటుంటారు. ఎక్కువగా చట్నీలను గ్రామాల్లో తింటుంటారు. వ్యవసాయం పనులకెళ్తారు కాబట్టి కొన్నిసార్లు టైమ్ ఉండదు. దీంతో ప్రతి ఏడాది పచ్చళ్లు తప్పనిసరిగా పెడుతారు. రుచితో పాటు పచ్చళ్లు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిస్ ను తగ్గిస్తాయి. ఒబేసిటీని తరిమికొడతాయి. ఇమ్యూనిటి పవర్ పెంచడమే కాకుండా కొవ్వును కరిగిస్తుంది. అయితే వానాకాలంలో పచ్చళ్లు బూజు పట్టడం కామన్ . కాగా రుచి మారొద్దంటే.. బూజు పట్టకూడదంటే ఈ ట్రిక్స్ తెలుసుకోండి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పచ్చళ్లు బూజు పట్టకుండా సింపుల్ ట్రిక్స్

పచ్చళ్ల నిల్వ కోసం ముందుగా గాలి చొరవని గాజు డబ్బాలను ఎంపిక చేసుకోండి.లోహంతో చేసినవి అస్సలు ఉపయోగించకూడదు. ఇవి చట్నీల్లో ఉండే ఆమ్ల తత్వాన్ని లోహాలతో చర్య జరుపుతాయి. దీంతో రుచి, వాసన మందగిస్తాయి. ప్లాస్టిక్ బాక్సులు కూడా వాడకూడదు. అలాగే చట్నీని స్టోర్ చేసే ముందు డబ్బాలను తుడిచి ఎండలో కాసేపు ఉంచాలి.

అలాగే పచ్చళ్ల కోసం సరైన ఆయిల్ వాడాలి. వర్షాకాలంలో పచ్చళ్లు బూజు వస్తున్నాయని డౌట్ వస్తే సాల్ట్ లేదా వెనిగర్ వేసి కలపండి. అలాగే ఎండగా ఉన్నప్పుడు పచ్చడ జాడీని మూత తీయకుండా ఎండలో ఉంచండి. దీంతో బూజు రాకుండా ఉంటాయి. తడి చేతులు, తడి చెంచాలు అస్సలు వాడకూడదు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed