పెళ్లి కార్డుపై ఎక్స్ పైర్ డేట్.. టాబ్లెట్ షీట్‌తో ఆహ్వానం..!

by Disha Web Desk 7 |
పెళ్లి కార్డుపై ఎక్స్ పైర్ డేట్.. టాబ్లెట్ షీట్‌తో ఆహ్వానం..!
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి అంటే జీవితంలో మరపురాని అనుభూతి. ఈ మధ్యకాలంలో యువత తమ పెళ్లిల్లు అందరినీ ఆకర్షించేలా సమ్‌థింగ్ స్పెషల్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో ఆలోచనతో ట్రెండ్ అవ్వాలని చూస్తున్నారు. అలా వైరటీగా చేసుకున్న పెళ్లిలు ఈ మధ్యకాలంలో చాలా వైరల్ కూడా అయ్యాయి. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా తన పెళ్లి కార్డును వెరైటీగా ముద్రించి వార్తల్లో నిలిచాడు. ఇంతకూ ఆ ఆహ్వాన పత్రిక విశేషాలేంటో చూద్దాం..

తిరువణ్ణామలైకి చెందిన ఎళిలరసన్‌ ఫార్మ రంగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఆయన సెప్టెంబర్ 5వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నాడు. దీనికోసం బంధువులను, సన్నిహితులను ఆహ్వానించేందుకు పెళ్లికార్డు ముద్రించాడు. అయితే అందరిలా కాకుండా కాస్తా వెరైటీగా ఆలోచించిన ఎళిలరసన్‌.. తన మెడికల్ ఫీల్డ్‌కు అనుగుణంగా పెళ్లి కార్డును టాబ్లెట్ షీట్ రూపంలో ముద్రించాడు. టాబ్లెట్ పేరు ఉండే చోట వధువు పేరు.. ఎక్స్ పైర్ డేట్ దగ్గర మ్యారేజ్ టైం, విందు సమయం, రిసెప్షన్ ప్రింట్ చేయించాడు. ఇంకా వాళ్ల వివరాలన్నీ కూడా ఆ మెడిసిన్ కార్డుపైనే వేయించాడు. దీంతో ఈ కార్డు అందుకున్న వాళ్లు మొదట అది మెడిసిన్ కవర్ అని భ్రమపడుతున్నారు. ఇది నా పెళ్లి కార్డు అని వరుడు చెప్పిన తర్వాత అంతరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


Next Story

Most Viewed