Oxygen box : ఇదో అద్భుతం.. అందులో పడుకుంటే పోయే ప్రాణం కూడా ఆగిపోతుంది!

by Javid Pasha |   (  Updated:2025-03-12 15:44:05  IST  )

Oxygen box : ఇదో అద్భుతం.. అందులో పడుకుంటే పోయే ప్రాణం కూడా ఆగిపోతుంది!

Oxygen box : ఇదో అద్భుతం.. అందులో పడుకుంటే పోయే ప్రాణం కూడా ఆగిపోతుంది!
X

దిశ, ఫీచర్స్ :

గాలిని చూడలేం.. బంధించలేం..

ఎందుకంటే అదో అద్భుతం.. అంతు పట్టని రహస్యం..

దేవుడి మాయ!.. అవును ఒకప్పుడు అందరూ ఇలాగే అనుకునేవారు.

కానీ ఇప్పుడు..!

ఆధునిక మానవుడు గాలిని బంధిస్తున్నాడు. అవసరాలకు వాడుకుంటున్నాడు.

ఎలా సాధ్యమైంది? అని సందేహమా? టెక్నాలజీ తెచ్చిన మార్పు బ్రో!.

మొత్తానికి మనిషి జీవితాన్నే మార్చేసిందిగా.. !

కొన్ని దశాబ్దాల క్రితం గాలిలో ఎగరడమంటే పక్షులకు, దేవతలకు తప్ప మనుషులతో అయ్యే పని కాదనుకున్నారు జనాలంతా. ‘వన్స్ అపాన్ ఏ టైమ్’ రైట్ బ్రదర్స్ తాము ఆకాశంలో ఎగిరే యంత్రాన్ని( విమానం) కనుగొంటామని చెప్పినప్పుడు పగలబడి నవ్వారు. వీళ్లకేదో పిచ్చి పట్టినట్లుంది అనుకున్నారు. కానీ ఏమైంది? మనుషులు సైతం ఆకాశమార్గాన ఎగురుతూ వెళ్లగలిగే విమానాన్ని కనుగొని నిరూపించారు రైట్ బ్రదర్స్. నేడు మనం ఏ దూర ప్రాంతానికైనా తక్కువ సమయంలో ఫ్లైట్‌లలో జర్నీ చేయగలుగుతున్నాం. హౌ ఈజ్ పాజిబుల్ ? మనిషి మెదడులో పుట్టుకొచ్చిన సరికొత్త ఆలోచ సాంకేతికతకు పురుడుపోయడమే అంటున్నారు నిపుణులు. ఆక్సిజన్ బాక్స్ (Hyperbaric oxygen box) లేదా ఆక్సిజన్ థెరపీ కూడా దాదాపు అలాంటిదే.

ఎలా ఉపయోగపడుతుంది?

థెరపీతో మనిషి జీవితాన్ని మరింత కంఫర్టబుల్ చేస్తూ.. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ప్రాణాన్ని సైతం నిలపడంలో మనిషి ప్రాణానికి భరోసా కల్పిస్తున్న ఆధునిక సాంకేతిక వైద్య పరికరమే హైపర్బారిక్ ఆక్సిజన్ బాక్స్ (Hyperbaric oxygen box). స్థూపాకారంలో .. సాధారణకంటే ఎక్కువ గాలి పీడనం కలిగి ఉంటుంది. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించడం ద్వారా ప్రాణాలు కాపాడుతుంది. అట్లనే ఆక్సిజన్ అందని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో అధిక ఒత్తిడికి, అలసటకు గురైనప్పుడు శరీరానికి అధిక సాంద్రత కలిగిన ఆక్సిజన్‌ను అందించడానికి అనుగుణంగా ఇది రూపొందించబడింది. ఈ నాన్ - ఇన్వాసివ్ (This non-invasive), నొప్పిలేని చికిత్స (pain-free therapy)లో ఇది పర్ఫెక్ట్‌‌గా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటప్పుడు అవసరం?

హైపర్‌బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది స్కూబా డైవింగ్‌లో వాటర్ ప్రెజర్ వేగంగా పడిపోయినప్పుడు అవసరం అవుతుంది. అట్లనే స్పేస్ ట్రావెల్‌లో గాలి పీడనం (air pressure) స్పీడ్‌గా పడిపోవడం వల్ల కలిగే డికంప్రెషన్ సిక్‌నెస్(decompression sickness) వంటి పరిస్థితిలో ఇది చాలా ముఖ్యం. రక్త నాళాల్లో గాలి బుడగలు అధికమై ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడు, గాయాలు లేదా ఇతర కారణాలవల్ల కణ జాలాలు దెబ్బతిన్నప్పుడు, అట్లనే రేడియేషన్ థెరపీవల్ల ఏదైనా కణజాల నష్టం వాటిల్లినప్పుడు, కణ జాలాకు ఎక్కువ ఆక్సిజన్‌ను అందించడం ద్వారా పరిస్థితిని పునరుద్ధరిస్తారు వైద్యులు. దీనినే హైపర్బారిక్ థెరపీ అంటారు. థెరపీలో భాగంగా రిస్క్‌లో ఉన్న వ్యక్తిని ఈ హైర్బారిక్ ఆక్సిజన్ చాంబర్‌లో పడుకోపెడతారు. బయటి పరిస్థితులకంటే ఇక్కడ ఆక్సిజన్ రెండు నుంచి మూడు రెట్లు అధికంగా గాలి పీడనం ద్వారా పెరుగుతుంది. ఊపిరి తిత్తులు సాధ్యమయ్యే దానికంటే ఎక్కువగా ఆక్సిజన్ సేకరించగలవు.

ఎలా పనిచేస్తుంది?

* రోగి హైపర్బారిక్ చాంబర్ (hyperbaric chamber)లోకి ప్రవేశిస్తాడు. ఇదొక మూసి ఉండే స్థూపాకార లేదా దీర్ఘ చతురస్రాకార పెట్టె.

*చాంబర్‌‌లో సాధారణ వాతావరణ పీడనానికి(1013 mbar) 1.5.-3 రెట్లు ఎక్కువ వేగంగా గాలి అందుతుంది.

* స్వచ్ఛమైన ఆక్సిజన్ (100% O2) మాస్క్ లేదా హుడ్ ద్వారా పంపిణీ చేయబడుతుంది. ఇది రోగి ఆక్సిజన్ అధికంగా ఉన్న గాలిలో ఊపిరి పీల్చుకోవడానికి అనుమతిస్తుంది.

* పెరిగిన ప్రెజర్ అండ్ ఆక్సిజన్ కాన్సంట్రేషన్ (pressure and oxygen concentration) శరీరానికి ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించడానికి దోహదపడుతుంది. ఇది కణజాలాలకు, అవయవాకలు ఆక్సిజన్‌ను మరింత మెరుగ్గా అందిస్తుంది.

ఉపయోగాలు

*గాయాలకు వైద్యం ( Wound healing) : హైపర్బారిక్ ఆక్సిజన్ (HBO)థెరపీ శరీరంలో కొల్లాజెన్ సంశ్లేషణను పెంచుతుంది. ఇది కణజాల ఆక్సిజన్‌ను మెరుగు పరుస్తుంది. గాయాలను నయం చేస్తుంది.

* కార్బన్ మోనాక్సైడ్ విష ప్రయోగం : శరీరంలో విష ప్రయోగం జరిగినప్పుడు రక్త ప్రవాహం, కణజాలాల నుంచి కార్బన్ మోనాక్సైడ్‌ను తొలగించడానికి సహాయపడుతుంది.

* డికంప్రెషన్ సిక్‌నెస్ (the bends): హెచ్‌బీఓ థెరపీ డికంప్రెషన్ అనారోగ్యాలు అనుభవించే స్కూబా డైవర్స్‌కు ట్రీట్మెంట్ అందించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

* ఇన్ఫెక్షన్లు అంటు వ్యాధులు : గ్యాస్ గ్యాంగ్రేన్ అండ్ ఆస్టియోమైలిటిస్ వంటి కొన్ని అంటు వ్యాులకు చికిత్స చేయడంలో హెచ్ బీఓ చికిత్స ప్రభావ వంతంగా ఉంటుంది.

* రేడియేషన్ గాయాలు : రేడియేషన్ ఎక్స్‌పోజర్ ప్రభావాలన వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

* ట్రామాటిక్ బ్రెయిన్ ఇజ్యూరి : కొన్ని అధ్యయనాలు హైపర్బారిక్ ట్రీట్మెంట్ మెదడు సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుందని వెల్లడించాయి. అట్లనే బాధాకరమైన మెదడు గాయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

*ఆటిజం: ఉన్న పిల్లల్లో ప్రవర్తనా పరమైన ఇబ్బందులు, హైపరాక్టివిటీస్, మెదడు సంబంధిత సమస్యలు, లక్షణాలను తగ్గించడంలో (behavioral and cognitive symptoms) సహాయపడుతుంది.

* ఫైబ్రోమయాల్జియా(Fibromyalgia): హైపర్బారిక్ చికిత్స, నొప్పి, అలసట వంటి ఫైబ్రోమయాల్జియా లక్షణాలను తగ్గిస్తుంది.

* స్పోర్ట్స్ గాయాలు : కంకషన్లు, కండరాల గాయాలతో(concussions and muscle strains) అథ్లెట్లు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ చికిత్స అవసరం అవుతుంది.

నష్టాలు

*ఊపిరి తిత్తుల వ్యాధి : క్రానిక్ అబ్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి తీవ్రమైన ఊపరితిత్తులు ఉన్నప్పుడు ఈ చికిత్స సరైంది కాదు.

* న్యుమోథొరాక్స్ : ఊపిరితిత్తులు పాడైపోయిన రోగులు హెచ్ఓబీ చికిత్సకు వెళ్లడం ప్రమాదకరం.

*చెవి లేదా సైనస్ సమస్యలు : వీటితో బాధపడుతున్న రోగులు హైపర్బారిక్ చికిత్స సమయంలో అసౌకర్యాన్ని లేదా గాయాలను అనుభవించే అవకాశం ఉంటుంది.

* సీజర్ డిజార్డర్స్ : సీజర్ డిజార్డర్స్ హిస్టరీ ఉన్న రోగులు ఈ చికిత్స సమయంలో మూర్ఛ లేదా పక్షవాతం బారిన పడవచ్చు.

READ MORE ...

Summer Effect : సమ్మర్‌లో ఆ పని చేస్తే అధిక చెమటలు! తర్వాత జరిగేది ఇదే..





Next Story