స్టైల్‌గా ఉంటుందని బెల్ట్ టైట్‌గా పెట్టుకుంటున్నారా?.. మీ హెల్త్ రిస్కులో పడ్డట్లే..

by Dishafeatures2 |
స్టైల్‌గా ఉంటుందని బెల్ట్ టైట్‌గా పెట్టుకుంటున్నారా?.. మీ హెల్త్ రిస్కులో పడ్డట్లే..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఏ రకమైన డ్రెస్ వేసుకున్నా బెల్ట్ పెట్టుకోవడం కూడా ఫ్యాషన్‌లో భాగమే. గతంలో కేవలం పురుషులు మాత్రమే పెట్టుకునేరు. కానీ ఇప్పుడు లేడీస్ కూడా పెట్టుకుంటున్నారు. కొన్ని డిజైన్ల డ్రెస్సులో అస్సలు బెల్టు ధరించకపోతే అస్సలు సెట్ కావు. అందుకే బెల్ట్ ఇప్పుడు తప్పనిసరై పోయింది. పైగా అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఈరోజుల్లో జీన్స్ ధరిస్తున్నారు. కొన్ని రకాల ప్యాంటీలు, ప్యాంట్లు బెల్లు లేకపోతే ఫిట్‌గా అనిపించవు. అందుకని వాటికి అంత ఆదరణ. అయితే బెల్టును టైటుగా పెట్టుకోవడంవల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

* బెల్ట్ మీ బాడీకి అనుకూలంగా, బ్యాలెన్స్‌గా ఉండేందుకు మాత్రమే అవసరం. అలాగని ఫుల్లు టైటుగా పెట్టుకుంటే నరాలపై ఎఫెక్టు పడుతుంది. నడుము, పొత్తికడుపు భాగాల్లో నొప్పి, తిమ్మిరి వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. అంతేకాకుండా రక్త నాళాల్లో ఆటకం ఏర్పడి శరీరానికి బ్లడ్ సప్లయ్‌లో ప్రతికూల మార్పులు వస్తాయి.

*టైటుగా పెట్టుకోవడంవల్ల డైజేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దీంతో గుండెల్లో మంట, పైత్య రసాల రిఫ్లెక్స్ అధికం కావచ్చు. బెల్ట్ బిగుతుగా ఉండటం మూలంగా కూర్చొని లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు కడుపులోని యాసిడ్స్‌పై గొంతులోకి నెట్టబడుతుంటాయి. దీంతో ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అధికం అవుతాయి.

*బెల్ట్ బిగుతుగా ధరించడం కారణంగా రీ ప్రొడక్టివ్ ఆర్గాన్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది సంతోనోత్పత్తి సమస్యలకు కారణం కావచ్చు. మహిళల్లో అయితే గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి పరోక్షంగా కారణం అవుతుంది.

* కొందరు బెల్టును మరీ టైటుగా ఫిక్స్ చేస్తుంటారు. దీనివల్ల వెన్నెముకపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది. నడుము, వెన్నుపూస నొప్పులు వేధిస్తాయి. అంతేకాకుండా సిస్టిక్ నాడి, శరీర భాగంలోని ఇతర నాడులు ప్రభావితం అవుతాయి. ఒత్తిడి కారణంగా మంట, పాదాల నరాలు ఉబ్బడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే బెల్టు ధరించేటప్పుడు మరీ టైటుగా ఉండకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు.



Next Story

Most Viewed