మొబైల్‌ ఫోన్ తలకు దగ్గరగా పెట్టుకుని పడుకుంటున్నారా?.. లైఫ్ రిస్కులో పడ్డట్టే !

by Disha Web Desk 6 |
మొబైల్‌ ఫోన్ తలకు దగ్గరగా పెట్టుకుని పడుకుంటున్నారా?.. లైఫ్ రిస్కులో పడ్డట్టే !
X

దిశ, ఫీచర్స్: మీకు రాత్రిపూట మొబైల్ ఫోన్ తలకు దగ్గరగా లేదా పిల్లోస్ కింద పెట్టుకొని పడుకునే అలవాటు ఉందా? అయితే వెంటనే మానుకోండి. ఎందుకంటే ఇలా చేయడంవల్ల లైఫ్ రిస్కులో పడుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్ నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుకు హానిచేస్తాయి. తరచూ నెత్తికి దగ్గరగా పెట్టుకుని పడుకునే వారిలో మెదడును చురుకుగా ఉంచే హార్మోన్ల విడుదలకు ఆటంకం కలుగుతుంది. ఇలా దీర్ఘకాలం కొనసాగితే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయి, మానసిక ఒత్తిడిని పెంచుతాయి.

ప్రవర్తనలో మార్పు వస్తుంది. మెంటల్ డిజార్డర్స్‌కు దారితీస్తాయి. నిద్రలేమి సమస్యలు ఏర్పడి ఇతర అనారోగ్యాలకు కారణం అవుతాయి. అంతేగాక మొబైల్ ఫోన్ తలకు దగ్గరగా ఉండటంవల్ల ఇమ్యూనిటీ పవర్‌పై కూడా నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందట. ఆకలి వేయకపోవడం, శ్వాస ఆడకపోవడం, హైబీపీ, కార్డియో వాస్క్యులర్ ప్రాబ్లమ్స్ తరచూ మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకుని పడుకునేవారిలో ఎక్కువగా తలెత్తే ఛాన్స్ ఉంది. అందుకే మీరు పడుకునే చోటుకు మొబైల్ ఫోన్‌ను కనీసం ఒక మీటర్ దూరంలో ఉంచి నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Next Story

Most Viewed