టీనేజర్స్ మెంటల్ హెల్త్‌పై OTT కంటెంట్ ఎఫెక్ట్ !

by Disha Web Desk 10 |
టీనేజర్స్ మెంటల్ హెల్త్‌పై OTT కంటెంట్ ఎఫెక్ట్ !
X

దిశ, ఫీచర్స్ : ఓటీటీ (ott) కంటెంట్‌‌ని అతిగా చూడటంవల్ల అది పిల్లల్లో వ్యసనంగా మారుతోందని, టీనేజర్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్లాట్‌ఫారమ్‌లు యువతలో బాడీ డిస్ సాటిస్‌ఫెక్షన్(dissatisfaction), అకాడమిక్ లాస్, సెల్ఫ్-ఎస్టీమ్ కోల్పోవడం వంటి బలహీనతలకు కారణం అవుతున్నాయని పేర్కొంటున్నారు. అందుకే పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే పేరెంట్స్ జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.

ఒకప్పుడు పిల్లలందరూ కలిసి ఆరు బయట సరదాగా ఆడుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. ఎక్కువగా గాడ్జెట్‌లలలో నిమగ్నమై ఉంటున్నారు. ముఖ్యంగా OTT ప్లాట్‌ఫారమ్‌లలో బందీలైపోతున్నారు. ఇది వారిలో తీవ్రమైన వ్యసనానికి దారి తీస్తోంది. మాల్స్, రెస్టారెంట్స్, బస్సులు, రైళ్లు ఇలా.. ఎక్కడ చూసినా టీనేజర్స్ గాడ్జెట్లకు అతుక్కుపోయి ఉండటం నేడు గమనించవచ్చు. ఒక్క భారత దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇండియాలో అయితే ఓటీటీల సగటు రోజువారీ వినియోగం 8 గంటల 29 నిమిషాలు, ఇక ప్రపంచం సగటు అయితే 6 గంటల 45 నిమిషాలుగా ఉంటోందని నివేదికలు చెబుతున్నాయి.

ఓటీటీలకు అడిక్ట్ అవడం వల్ల టీనేజర్స్‌లో తమ శారీరక అసంతృప్తికి, విద్యాపరమైన నష్టానికి, కెరీర్ లాస్‌కు, డిప్రెసివ్ సింప్టమ్స్‌కు, ఆత్మన్యూనత భావానికి దారితీస్తోంది. దీంతోపాటు శారీరక శ్రమ, సోషల్ కాంటాక్ట్స్ తగ్గడంవల్ల మెంటల్ హెల్త్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతోంది. పిల్లలు ప్రకటనలకు ప్రభావితం అయి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంవల్ల ఒబేసిటీ దారితీస్తోంది. ఎక్కువ గంటలు కేటాయించడం కారణంగా క్వాలిటీ స్లీప్ దెబ్బతింటోంది. ఈ విధమైన జీవన శైలి మార్పులతో హై బ్లడ్ ప్రెషర్, హై లిపిడ్స్, టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్, PCOS, యాంగ్జయిటీ, డిప్రెషన్, OCD, బాడీ ఇమేజ్ డిస్ సాటిస్‌ఫెక్షన్(dissatisfaction) వంటి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే పిల్లలను, ముఖ్యంగా టీనేజర్లను జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉందని సైకాలజిస్టులు చెప్తున్నారు. వారితో ఫ్రెండ్లీగా ఉంటూ ఓపెన్ కమ్యూనికేట్ చేయాలని, పిల్లల కోసం ప్రత్యేకించి క్వాలిటీ సమయం కేటాయించి మోటివేట్ చేయాలని చెప్తున్నారు.

Next Story