మీ పిల్లలు ఎక్కువసేపు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారా?.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త !

by Dishafeatures2 |
మీ పిల్లలు ఎక్కువసేపు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారా?.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త !
X

దిశ, ఫీచర్స్ : ‘ఈ కాలం పిల్లలు మహా ముదుర్లు’ అని మురిసిపోతుంటారు కొందరు పెద్దలు. ఎందుకంటే.. చిన్న ఏజ్‌లోనే వారు చేసే కొన్ని పనులు ఆశ్చర్య పరుస్తుంటాయి. కానీ ఆందోళన కలిగించే విషయాలు కూడా కొన్ని ఉన్నాయని, వాటిని గుర్తించి జాగ్రత్త పడకపోతే నష్టం జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక చాలామంది పిల్లలు దానికి బానిసలే అవుతున్నారు. వీడియో గేమ్స్‌పై పెట్టినంత శ్రద్ధ తిండి, చదువు, ఇతర అంశాలపై పెట్టడం లేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు పేరెంట్స్. పిల్లల ప్రవర్తన, మనస్తత్వంపై కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు నిర్వహించిన అధ్యయనంలోనూ దాదాపు ఇదే ఆందోళన వెల్లడైంది.

మూడేళ్ల నుంచి పదేళ్లలోపు పిల్లల్లో చాలామంది ఫిజికల్ యాక్టివిటీస్, క్వాలిటీ స్లీప్, తిండి వంటివి తగ్గించి, ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్లలో, ఆన్‌లైన్ వీడియో గేమ్స్‌లో గడపడానికి ఆసక్తి చూపుతున్నారట. దాదాపు 3, 200 మంది పిల్లలపై అధ్యయనం నిర్వహించిన నిపుణులు, వివిధ దేశాలకు చెందిన 86 వేల మందికిపై 14 నుంచి 16 ఏళ్లలోపు వయస్సుగల పిల్లల డేటాను కూడా ఎనలైజ్ చేశారు. వారి అలవాట్లు, జీవనశైలి, కుటుంబ పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా వారు బాలుర కన్నా బాలికలే ఎక్కవగా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నట్లు గుర్తించారు.

తరచుగా స్మార్ట్‌ఫోన్ చూడటం, గేమ్స్ ఆడుతూ ఆన్‌లైన్‌లో గడపడంవల్ల పిల్లల్లో దాదాపు 38 శాతం మంది ప్రతి రోజూ ఒక్కసారైనా ఈ రోజు బడి ఎగ్గొడితే బాగుండు సరదాగా ఫోన్ చూసుకుంటూ ఉండవచ్చు అని భావిస్తున్నారట. మరో 25 శాతం మంది పిల్లలు ఎక్కువ సేపు ఆన్‌లైన్‌లో సమయం కేటాయించడం కారణంగా హైపర్ యాక్టివిటీతోపాటు వివిధ మెంటల్ డిజార్డర్లను ఎదుర్కొంటున్నారు. ఇంకొందరు కళ్లల్లో మంట, తలనొప్పి వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొందరు చిన్నారులు తరచుగా ఫోన్ చూడటం కారణంగా కంటి చూపు మసకబారి చిన్న ఏజ్‌లోనే కళ్లాద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, తమ పిల్లలు స్మార్ట్ లేదా ఆన్‌లైన్‌లో గడపకుండా చూడాలని సూచిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed