పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? ఈ డ్రింక్స్‌ మ్యాజిక్‌తో నాజూగ్గా తయారవుతారు..

by Disha Web Desk 9 |
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? ఈ డ్రింక్స్‌ మ్యాజిక్‌తో నాజూగ్గా తయారవుతారు..
X

దిశ, ఫీచర్స్: దీపావళి సెలబ్రేషన్స్ ఇప్పుడిప్పుడే ముగిశాయి. చాలా మంది ఈ ఫెస్టివ్ సీజన్‌లో రుచికరమైన ఆహారం, పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ముఖ్యంగా స్వీట్స్‌తో పొట్ట చుట్టూ కొవ్వు చేరిపోతుంది. ఇదంతా పండగ హడావిడిలో ఓకే అనిపించినా.. రొటీన్ లైఫ్‌కు వచ్చే సరికి మళ్లీ వెయిట్ తగ్గాలనే ఆలోచన వస్తుంది. ఫెస్టివ్ వీక్‌లో పెరిగిన వెయిట్‌ను తగ్గించుకునేందుకు.. కేలరీలను బర్న్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం రెగ్యులర్ ఎక్సర్‌సైజ్, సరిపడ నిద్ర, హెల్తీ డైట్, స్ట్రెస్‌కు దూరంగా ఉండటం, ఆల్కహాల్‌ను అవాయిడ్ చేయాలంటున్న నిపుణులు.. వీటితోపాటు పొట్ట కొవ్వును కరిగించుకునే ఎఫెక్టివ్ డ్రింక్స్ గురించి చెప్తున్నారు.

గ్రీన్ టీ : యాంటీఆక్సిడెంట్ల గొప్ప మూలంగా ఉన్న గ్రీన్ టీ.. జీవక్రియను పెంచడానికి, ఫ్యాట్‌ బర్న్‌ చేయడానికి సహాయపడుతుంది. ఇది కెఫీన్‌ను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి శక్తిని పెంచుతుంది. మరింత అప్రమత్తంగా ఉండటానికి హెల్ప్ అవుతుంది.

లెమన్ వాటర్: రిఫ్రెష్ అండ్ హైడ్రేటింగ్ డ్రింక్‌గా పిలవబడే లెమన్ వాటర్.. పొట్ట ఫుల్‌గా ఉందనే అనుభూతిని కలిగిస్తుంది. షుగర్ డ్రింక్స్ తీసుకోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రవిసర్జన ప్రభావాన్ని(డైయురెటిక్ ఎఫెక్ట్) కలిగి ఉండే నిమ్మరసం.. టాక్సిన్స్‌ను బయటకు నెట్టేందుకు, ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

అల్లం టీ: గొంతు నొప్పి, మంటను తగ్గించడంలో గొప్పగా పనిచేస్తుంది అల్లం టీ. థర్మోజెనిక్ లక్షణాలను కూడా కలిగి ఉండే ఈ డ్రింక్.. జీవక్రియను పెంచడానికి, ఫ్యాట్‌ను బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్: బరువు తగ్గడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యల నివారణకు పాపులర్ హోమ్ రెమెడీ ఆపిల్ సైడర్ వెనిగర్. ఈ డ్రింక్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, సంతృప్తిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

అలోవెరా జ్యూస్: కలబంద రసం ఒక సహజమైన డిటాక్సిఫైయర్. యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్‌ మూలంగా ఉన్న అలోవెరా.. టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

కుకుంబర్ వాటర్: రిఫ్రెష్, హైడ్రేటింగ్ పానీయం అయిన ఈ డ్రింక్‌లో.. కేలరీలు, షుగర్‌‌ తక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కొన్ని మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంది. టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి హెల్ప్ చేస్తుంది.

Next Story