Viral : టేస్టీగా ఉంటుందని సమోసా తిన్నారో.. జైలుకెళ్లాల్సిందే!

by Javid Pasha |
Viral : టేస్టీగా ఉంటుందని సమోసా తిన్నారో.. జైలుకెళ్లాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : మన చుట్టు పక్కల సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మరికొన్ని విషయాలు వినడానికి వింతగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ వంటి నియమాలు కూడా ఇందులో భాగంగా ఉంటున్నాయి. పైగా కొన్ని చోట్ల వాటిని పాటించకపోతే కఠినమైన శిక్షలు కూడా అమలు చేస్తుంటారు. చివరికి సమోసా తిన్నా నేరంగా పరిగణించి జైలుకు పంపే దేశం కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? ఇదొక్కటే కాదు, ఎన్నోచోట్ల ఇలాంటి కొన్ని వింతైన పద్ధతులు, అలవాట్లు, సంప్రదాయాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.

అక్కడ సమోసా తినడం నేరం

సమోసా అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి.. పైగా చాలామందికి చాయ్ సమోసా అంటే ఎక్కడాలేని ఉత్సాహం పొంగుకొస్తుంది. సమోసా తింటూ టీ తాగితే ఆ టేస్టే వేరు అంటుంటారు హైదరాబాదీలైతే.. కానీ సోమాలియా దేశంలో సమోసా సమోసా పేరు వింటేనే భయపడతారు అక్కడి జనాలు. ఎందుకంటే అక్కడ దీనిని అమ్మడం, తినడం నిషేధించారు. పొరపాటున ఎవరైనా తింటే నేరంగా పరిగణించి జైలుకు పంపుతారు. 2011 నుంచి ఈ నిషేధం అమల్లో ఉంది. సమోసా త్రిభుజాకార రూపం క్రిష్టియన్ హోలీ ట్రినిటీ(Christian Holy Trinity)ని సూచిస్తుంది. పైగా దీని మూడు పాయింట్లు క్రైస్తవుల పవిత్ర చిహ్నాలని నమ్ముతారు. కాబట్టి ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు పడతాయని చెప్తుంటారు. నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

చూయింగమ్ కూడా..

ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ. సింగపూర్‌లో చూయింగ్ గమ్ నిషేధం. దీనికో కారణం ఉంది.1992లో ఓ వ్యక్తి తన ఫోర్ వీలర్‌లో వెళ్తున్నప్పుడు చూయింగ్ గమ్ (Chewing gum) అంటుకోవడం కారణంగా గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందట. రవాణా సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇక్కడ చూయింగమ్‌ను బ్యాన్ చేశారు. నిషేధం అయితే ఉంది కానీ.. కఠినంగా అమలు చేయడం లేదనే విమర్శలున్నాయి.

బ్లూ జీన్స్ వేసుకోవడానికి వీల్లేదు

కలర్ ఫుల్ జీన్స్ వేసుకోవడానికి అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా బ్లూ జీన్స్ (Blue jeans) అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా అందరికీ ఇష్టమే.. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఈ కలర్ జీన్స్ వేసుకోవడానికి వీల్లేదు. నీలం రంగు తమకు శత్రుదేశమైన అమెరికాను గుర్తుకు తెస్తుందనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. అలాగే మలేషియాలో ఎల్లోకలర్ దుస్తులు వేసుకోవడం నిషేధం. 2015లో ఈ దేశ ప్రజలు పసుపు రంగు టీ షర్టులు ధరించి అక్కడి ప్రధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీనిని కంట్రోల్ చేసే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వ సంస్థల్లో, స్థలాల్లో పసుపు రంగు దుస్తులను వేసుకు రావడాన్ని నిషేధించించారు.

వీడియో గేమ్స్ ఆడొద్దు!

కొన్ని దేశాలు వీడియో గేమ్స్‌ను ఎంటర్టైన్మెంట్ రంగంలో భాగంగా అంగీకరిస్తాయి. కానీ గ్రీస్‌‌లో మాత్రం ఇవి నిషేధిస్తూ 2002లో అక్కడి ప్రభుత్వం చట్టం తెచ్చింది. కేవలం వీడియో గేమ్స్ (Video games) మాత్రమే కాదు, ఎలాంటి ఇతర కంప్యూటర్ గేమ్స్ కూడా ఆడటానికి వీల్లేదట. ఇక ఫ్రాన్స్‌ విషయానికి వస్తే ఈ దేశంలో కెచ్‌అప్‌‌ని నిషేధించారు. స్కూల్ క్యాంటీన్‌లలో వాడటం మరింత తీవ్రమైన నేరమట. ఫ్రెంచ్ ప్రభుత్వం ఇక్కడి వంటకాల సమగ్రతను, ప్రత్యేకతను కాపాడుతూ.. అమెరికా ఆహారపు అలవాట్లను నిరోధించడానికి ఈ విధమైన డెసిషన్ తీసుకుందని చెబుతుంటారు.

Advertisement

Next Story