Dust mites: పిల్లల్లో అలెర్జీలకు కారణమవుతున్న డస్ట్‌ మైట్స్‌.. నివారణ ఎలా?

by Javid Pasha |
Dust mites: పిల్లల్లో అలెర్జీలకు కారణమవుతున్న డస్ట్‌ మైట్స్‌.. నివారణ ఎలా?
X

దిశ, ఫీచర్స్ : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? అలెర్జీల బారినపడుతున్నారా? అయితే వారు ధూళిలో ఉండే పురుగుల(డస్ట్ మైట్స్)వల్ల ప్రభావితం అయి ఉండవచ్చు. ఎందుకంటే కంటికి కనిపంచని ఈ సూక్ష్మజీవులే ఎక్కువగా అందుకు కారణం అవుతుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటికి గురికావడం కొన్నిసార్లు ఆస్తమా, అలెర్జీ రినైటిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని చెప్తున్నారు.

వాతావరణంలో అధిక తేమస్థాయిలు కూడా దుమ్ము లేదా ధూళి పురుగుల ప్రభావం పెరుగుదలకు కారణం అవుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో పిల్లల్లో అలెర్జీలు ఎక్కువగా సంభవిస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఒక నివేదిక ప్రకారం ఇండియాలో 35 మిలియన్ల మంది ఆస్తమా, అలెర్జీలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరొక అంచనా ప్రకారం 2.4 శాతం మంది పిల్లలు ఆస్తమాను ఎదుర్కొంటుండగా.. కౌమార దశలో ఉన్నవారు 22 శాతం మంది అలెర్జీ రినైటిస్‌తో బాధపడుతున్నారు. ఇందుకు డస్ట్ మైట్స్ ప్రధాన కారణం. తరచుగా ముక్కు కారడం, ముక్కులో ఏదో అడ్డంకిగా అనిపించడం, రాత్రివేళల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దీర్ఘకాలికంగా పొడిదగ్గు వంటివి డైస్ట్ మైట్స్‌కు గురైన పిల్లల్లో కనిపించే లక్షణాలుగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఏం చేయాలి?

* పిల్లలు డస్ట్‌ మైట్స్ అలెర్జీలకు గురికాకుండా ఉండాలంటే వారికి సంబంధించిన బట్టలు, ముఖ్యంగా దుప్పట్లు, దిండ్లు, బెడ్‌షీట్లు, టవల్స్ శుభ్రంగా ఉంచాలి. అలెర్జీ ప్రూఫ్ కవర్లను ఉపయోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వాటిని వేడినీటిలో కాసేపు నానబెట్టి ఆరవేయడం మంచిది.

* అలెర్జీలు కలిగించే పురుగులు లేదా సూక్ష్మజీవులకు గురికాకుండి అధిక సామర్థ్యం గల పార్టికల్స్ ఎయిర్ ఫిల్టర్లను ఉపయోగించవచ్చు. అలాగే ఇంటిలోపలి తేమ స్థాయిలు 50 శాతానికి మించి పెరగకుండా చూసుకోవాలి. తగినంత సూర్యకాంతికి గురయ్యేలా క్రాస్ విండోస్ ఉంటే మంచిది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను పిల్లలకు పెట్టాలి. దీనివల్ల అలెర్జీకి కారక డస్ట్ మైట్స్‌తో పోరాడేలా పిల్లల శరీరం తయారవుతుంది.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story