మనుషుల చీకటి కోణాలకు ప్రేరణ 'D ఫ్యాక్టర్' : సైంటిస్టులు

by Disha Web Desk 6 |
మనుషుల చీకటి కోణాలకు ప్రేరణ D ఫ్యాక్టర్ : సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్ : భూ ప్రపంచంలో మనుషుల వ్యక్తిత్వాలను పరిశీలిస్తే.. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. పైకి కనిపించే లక్షణం ఒకటైతే, పరదా చాటున మరొకటి. సాఫ్ట్ నేచర్ కలిగివారు కూడా కొన్నిసార్లు డార్క్ షేడ్ ప్రదర్శిస్తుంటారు. ఒక్కోసారి పరిస్థితులే ఆవిధంగా ప్రేరేపిస్తాయి. అయితే ఇలాంటి ప్రవర్తనకు కారణమైన డ్రైవింగ్ ఫోర్స్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

సైకాలజీలో'సైకోపతి, నార్సిసిజం, మాకియవెల్లియనిజం(మోసపూరితంగా ఉండే సామర్థ్యం)' అనే మూడు ధోరణులే మనుషుల చీకటి విషయాలకు చోదకులుగా పరిగణించబడతాయి. వీటినే ప్రాథమిక సంకేతాలుగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే అత్యంత చెడు కోరికలను కలిగించే ఒక రహస్యాన్ని శాస్త్రవేత్తలు అన్‌లాక్ చేశారు. జర్మనీ, డెన్మార్క్‌ సైకాలజిస్టుల 2018 అధ్యయనం.. అన్ని చీకటి ప్రేరణలను నడిపించే ఉమ్మడి శక్తిని కనుగొనగలిగింది. దానికి 'D(వ్యక్తిత్వానికి సంబంధించిన చీకటి కారకం) అని పేరు పెట్టింది. ఇక 'D' ఫ్యాక్టర్‌ను అర్థంచేసుకోవాలంటే ఆంగ్ల మనస్తత్వవేత్త చార్లెస్ స్పియర్‌మాన్ మొదట ప్రతిపాదించిన 'G' ఫ్యాక్టర్‌ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి.

'G' ఫ్యాక్టర్‌ ప్రకారం.. ఎవరైనా ఒక రకమైన అభిజ్ఞా పరీక్షలో బాగా రాణిస్తే, వారు ఇతర రకాల మేధస్సు పరీక్షల్లో కూడా రాణించాల్సి ఉంటుంది. అదేవిధంగా 'మానవ వ్యక్తిత్వంలో చీకటి కోణాలు కూడా ఒక సాధారణ హారం కలిగి ఉంటాయి' అని కోపెన్‌హాగన్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ ఇంగో జెట్లర్ సైన్స్ తెలిపారు. ఇంటెలిజెన్స్ మాదిరిగా అవన్నీ ఒకే స్థాన ధోరణికి వ్యక్తీకరణగా చెప్పవచ్చని ఆయన వెల్లడించారు.

D ఫ్యాక్టర్ ఎలా కనుగొనబడింది?

2,500 మంది వ్యక్తులతో నాలుగు వేర్వేరు అధ్యయనాలను చేపట్టిన జెట్లర్.. ప్రతి వ్యక్తి చీకటి లక్షణాలను(అహం, మోసం, నైతిక వియోగం, సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీ, మానసిక అర్హత, మానసిక స్థితి, శాడిజం, స్వీయ-ఆసక్తి, ద్వేషం) లెక్కగట్టారు. వారిని పలు ప్రశ్నలను అడగడం ద్వారా ఈ కోణాలన్నీ విభిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ, అదే సమయంలో వారు ఒక సెంట్రల్ కోర్ డార్క్‌నెస్ ఫ్యాక్టర్ 'D' ద్వారా ఏకీకృతం చేయబడ్డారు. ఈ కారకం ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా కనిపిస్తుంది. జెట్లర్ ప్రకారం, కొంతమందికి D కారకం కేవలం నార్సిసిజం(నైతిక వియోగం) కావచ్చు. మరికొందరికి ఇది సైకోపతి లేదా రెండింటి కలయిక కావచ్చు.



Next Story

Most Viewed