ఫ్రూట్స్ తిన్నాక వాటర్ తాగుతున్నారా?

by Sujitha Rachapalli |
ఫ్రూట్స్ తిన్నాక వాటర్ తాగుతున్నారా?
X

దిశ, ఫీచర్స్: పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్రూట్స్ తిన్న తర్వాత నీళ్లు తీసుకోవద్దని సూచిస్తారు. అలా కాకుండా తీసుకుంటే హెల్త్ పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

* జీర్ణక్రియ తగ్గుదల

పండ్లు తీసుకున్నాక నీరు తాగితే డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోతుంది. ఇది ఎసిడిటీకి దారితీసే అవకాశం ఉండగా.. అసౌకర్యంగా కూడా ఉంటుంది.

* కడుపు నొప్పి

ఫ్రూట్స్ లో షుగర్, ఈస్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పండ్లు తీసుకున్నాక వెంటనే వాటర్ తాగడం వల్ల పొట్టలో ఉండే యాసిడ్స్ డైల్యూట్ అయిపోతాయి. ఇది కాస్త శరీరంలో కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ ఉత్పత్తికి దారితీస్తుంది.

* బాడీ pHపై ఇంపాక్ట్

పండ్లలోనే ఆల్రెడీ నీరు అధికంగా ఉంటుంది. అవి తిన్న వెంటనే వాటర్ తాగితే స్టమక్ pH బ్యాలెన్స్ దెబ్బతింటుంది.

* బ్లడ్ షుగర్ లెవల్స్

పండ్లు తిన్నాక వాటర్ తాగడం వల్ల డైజెస్టివ్ ప్రాసెస్ స్లో అవుతుంది. ఇది కాస్త జీర్ణం కాని ఆహారం ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యేందుకు దారితీస్తుంది. దీనివల్ల బాడీ ఇన్సులిన్ లెవల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి.

* గ్యాస్ట్రిక్ జ్యూస్

పండ్లు తీసుకున్నాక నీరు తాగితే డైజెస్టివ్ ఎంజైమ్స్ డైల్యూట్ అయిపోతాయి. బాడీలోని గ్యాస్ట్రిక్ జ్యూస్ హార్ట్ బర్న్ కు కారణం అవుతుంది.



Next Story

Most Viewed