కాబోయే భర్తతో పొరపాటున కూడా ఈ విషయాలను చెప్పకండి..?

by Disha Web Desk 10 |
కాబోయే భర్తతో పొరపాటున కూడా ఈ విషయాలను చెప్పకండి..?
X

దిశ,వెబ్ డెస్క్: పెళ్ళి కుదిరాక అమ్మాయిలు, అబ్బాయిలు వారికి కాబోయే వాళ్లతో ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడుకుంటారు. ఇద్దరూ వారి వారి ఆలోచనలు పంచుకుంటారు. దీని వల్ల రిలేషన్‌షిప్ పెరుగుతుంది. అయితే ,మీకు కాబోయే భర్తతో మాట్లాడేటప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడకండి. వీటి వల్ల కుదిరిన సంబంధాలు కూడా చెడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

ఫ్యామిలీ

అమ్మాయిలు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. పెళ్ళికి ముందే మీ ఫ్యామిలీ గురించి ఎంత తక్కువ మాట్లడితే అంత మంచిది. దీని వల్ల ఫ్యూచర్‌లో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు చెప్పకుండా ఉండటమే మంచిది.

అత్త గారు

పెళ్ళికి ముందే అత్తగారు గురించి అడగకపోవడమే మంచిది. ముందే ఈ విషయాలు ఎందుకు అడుగుతుందా అనే సందేహం వాళ్లకి రావొచ్చు. కాబట్టి అలాంటి తప్పులు చేయకపోవడమే మంచిది.

స్నేహితులు

పెళ్ళికి ముందే మీ స్నేహితులను పరిచయం చేయకపోవడమే మంచిది. ఒక వేళ మీరు పరిచయం చేస్తే.. వారి వల్ల మీ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది.

Next Story