N అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది..? కనెక్ట్ అయితే వదిలి పెట్టరా..?

by Disha Web Desk 7 |
N అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది..? కనెక్ట్ అయితే వదిలి పెట్టరా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి మనిషికి పుట్టిన సమయాన్ని బట్టి జాతక ఫలాలను చూస్తారు జ్యోతిష్యులు. శిశువు పుట్టిన సమయాన్ని బట్టి జన్మ నక్షత్రం, ఏ రాశి అనేది చూస్తారు. వాటి ఆధారంగానే వారి భవిష్యత్తును అంచనా వేస్తారు. అయితే పండితులు జన్మ నక్షత్రం, నామ నక్షత్రం ఆధారంగా రాశులను పరిశీలిస్తారు. మనిషి వ్యక్తిత్వాన్ని తెలిపే ఈ రెండు ప్రధానమైవే. కానీ, ఈ రెండింటి మధ్య వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి.

జన్మ నక్షత్రం.. అనారోగ్యం, గృహ, గ్రామ ప్రవేశం, యుద్ధం, దేశ సంబంధమైన వాటిని తెలియజేస్తుండగా, నామ నక్షత్రం.. వివాహం, పర్యటనలు, విహారయాత్రలు తదితర వాటిని వివరిస్తుంది. విశాఖ నాలుగోపాదం అనురాధ నక్షత్రంలో పుట్టిన వారికి వృశ్చిక రాశి వస్తుంది. వీరి పేర్లు ‘నా, నీ, నూ, నే’తో ప్రారంభం అవుతాయి. అయితే ‘N’ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వారి జాతక చక్రం ఎలా ఉండబోతుంది.. ఆ రాశి వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు..? వాళ్ల మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం..!

* N అక్షరంతో మొదలయ్యే వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. దీంతో పాటు కోపం కూడా ఎక్కువే. వీళ్లు ఎంతో తెలివిగా వ్యవహరించి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటారట.

* N అక్షరంతో మొదలయ్యే వారు ఎవరిని అంత త్వరగా నమ్మరట. ఒకవేళ నమ్మితే వారి మాటకు కట్టుబడి.. అవతలి వ్యక్తికి ఎంతో గౌరవాన్ని ఇస్తారట.

*N అక్షరం ఉన్న వారికి అనుకున్నది సాధించే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే.. ఎంత కష్టమైన పని అయిన సరే సునాసనంగా చేసే తత్వం వీరు కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా మనసు పెట్టి నిర్ణయం తీసుకుంటారు.

* N అక్షరంతో ఉన్న వాళ్లు త్వరగా ఏ విషయాన్ని మిగిలిన వాళ్లతో చెప్పడానికి ఇష్టపడరు. వారిలోనే దాచేసుకుంటారు. ఇలా చేయడం ఒక్కోసారి వారికి నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఎవరికి పంచుకోకుండా లోలోపలే బాధేపడెసరికి ఆ బాధ కాస్త కోపంగా మారిపోయి.. పని మీద ఒత్తిడి పడుతోంది. వారు ఎంత తెలివైన వారు అయినప్పటికీ ఇలాంటి సమయంలో పనిలో డెవలెప్ మెంట్ సాధించలేరు.

* అంతేకాదు నిజాయితీతో వ్యవహరించడం వీరికి ఉన్న మంచి అలవాటు. ఊరికే ఎవరితోనూ మాట పడరు. వీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. ఎవరితోనూ గొవడలు పడరు. అలాగే ఏదైనా సాధించాలి అనకుంటే అది ఎంత కష్టమైన సాధించి తీరతారు. ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా వారికున్న తెలివిని ఉపయోగించి ముందుకు వెళతారు తప్ప వెనుకడుగు వెయ్యరు.

*వీరు ఎంత మంచి తనంతో ఉంటారో అంతే కోపం ఉంటుంది. వీరితో గొడవ పడటం అంటే కొరివితో తల గోక్కోవడం లాంటిది. ఎందుకంటే ఈ N అక్షరం వాళ్లు చాలా మొండిగా వ్యవహరిస్తారు. ఏ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టారు. టైం వచ్చినప్పుడు అంతకంతకు రివేంజ్ తీర్చుకుంటారు. వీళ్లలో శత్రుత్వం అంత మంచిది కాదు.

* N అక్షరంతో ఉన్న వారికి దేవుడి అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది

Read More: కాకి గూడు నుంచి ఈ ఒక్కటి తెచ్చుకోండి.. మీకు పట్టిన దరిద్రం మొత్తం పరార్

Next Story

Most Viewed