వర్షాలు పడే సమయంలో పిడుగులు ఎందుకు పడుతాయో తెలుసా?

by Dishanational2 |
వర్షాలు పడే సమయంలో పిడుగులు ఎందుకు పడుతాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయితే వర్షాలు పడిన సమయంలో కొన్ని చోట్ల పిడుగులు పడటం అనేది కామన్.ఈ పిడుగు పాటుకు ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా, అసలు పిడుగులు ఎలా పడుతాయి అనేది చూద్దాం.

అయితే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి, ఆకాశంలో దాదాపు 25000ల అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడుతాయి. ఆ సమయంలో పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వలన తక్కువ బరువున్న ధనావేశిత ( ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న మేఘాలు) పైకి వెళ్తాయి. అదేవిధంగా అధిక బరువు ఉండే రుణావేశిత మేఘాలు కిందికి వస్తాయి.


అయితే చిన్నప్పుడు మనం సామాన్య శాస్త్రంలో చదువుకున్నట్లుగా, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి. అప్పుడు.. ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోతాయి. ఆ సమయంలో దగ్గరలో మరే ఇతర వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు దూసుకుపోతాయి. దీంతో మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్‌ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. ఇలా రావడాన్నే పిడుగు పడటం అని అంటారు.

Also Read...

మండే ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడతాయో తెలుసా?

Next Story