తినే ముందు విస్తరాకు చుట్టు నీరు ఎందుకు చల్లుతారో తెలుసా?

by Dishanational2 |
తినే ముందు విస్తరాకు చుట్టు నీరు ఎందుకు చల్లుతారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : అరటి ఆకుల్లో అన్నం తినడం అనేది పూర్వకాలం నుంచి వస్తుంది. ఇప్పటికీ కొన్ని చోట్ల అరటి ఆకుల్లోనే భోజనం చేస్తుంటారు. అయితే అరటి ఆకుల్లో భోజనం చేసే క్రమంలో చుట్టూ నీళ్లు చల్లడం అనేది ఆనవాయితీ. ఇక ఇప్పటికీ బ్రహ్మణులు ఈ పద్ధతిని పాటిస్తుంటారు. కానీ చాలా మందిలో ఓ ప్రశ్న మొదలవుతూ ఉంటుంది. అది ఏమిటంటే? అసలు అరటి ఆకు చుట్టూ నీరు ఎందుకు చల్లుతారు.

దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో విస్తరు చుట్టూ మూడు సార్లు నీళ్లు చల్లడాన్ని చిత్రహుతి అని పిలుస్తారంట.అయితే విస్తరు చుట్టుూ నీళ్లు చల్లడం అంటే దేవుడికి నైవేద్యం సమర్పించినట్లే అంతే కాకుండా ఆహారం పెట్టినందుకు ధన్యవాదాలును సూచిస్తుందంట.

ఇదే కాకుండా దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉందంట. అయితే ప్రాచీనకాలంలో ఋషులు ఎక్కవగా ఆశ్రమాల్లో, అడవుల్లో నిసించే వారంట. అలాగే నేలపై కూర్చొని భోజనం చేసేవారంట. అయితే వారు అరటి ఆకుల్లో భోజనం చేసే సమయంలో కింద ఉన్నదుమ్ము రేణువులు ఆహారంలో పడకుండా ఉండటానికి నీటిని చల్లేవారంట.


Next Story

Most Viewed