వారానికి ఏడు రోజులే ఎందుకు ఉంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా?

by Samataha |
వారానికి ఏడు రోజులే ఎందుకు ఉంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా?
X

దిశ, ఫీచర్స్ : క్యాలెండర్ చూడగానే అందరికీ ఏం కనిపిస్తుంది. వారాలు, తేదీలు. ఏ క్యాలెండర్ అయినా సరే వారానికి ఏడు రోజులు, నెలకు నాలుగు వారాలు ఉంటాయి.కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వారానికి ఏడు రోజులే ఎందుకు ఉంటాయి. ఎక్కువ ఉండొచ్చుగా లేదా తక్కువగా ఉండొచ్చు కదా అని? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

ఖగోళశాస్త్రం ప్రకారం.. చంద్రుడు 27.3 రోజుల్లో భూమి కక్ష్యను పూర్తి చేస్తాడు. ఇక పౌర్ణమి నుంచి అమావాస్యకు, అమావాస్య నుంచి పౌర్ణమికి మధ్య 14.5 రోజుల సమయం పడుతోంది. దీనిని సగం చేస్తే ,7.25 అంటే దాదాపు ఏడు రోజులు. ఒక నెలను 2 పక్షాలుగా విభజించారు. ప్రతి పక్షం రెండు వారాలుగా విభజించారు. ఇలా మొత్తం 52 వారాలు కలిపి ఒక సంవత్సరాన్ని తయారు చేశారంట. అలాగే, మన భారతీయ సంప్రదాయం ప్రకారం,అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చి, గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేశాడు. అప్పటి నుంచే ఇండియాలో ఏడు రోజుల వారం అనే కాన్సెప్ట్ వ్యాపించిందంట. అప్పటి నుంచి వారానికి ఏడు రోజులు ఉంటున్నాయంట.

Next Story

Most Viewed