శ్రీ కృష్ణుడి తలపై నెమలి పించం ఈకను ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా?

by Disha Web Desk 9 |
శ్రీ కృష్ణుడి తలపై నెమలి పించం ఈకను ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకృష్ణుడు ఎప్పుడూ నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించి ఎంతో అందంగా కనిపిస్తాడు. నెమలి ఈకతోనే ఆయనకు కళ ఉట్టిపడుతుంది. అయితే కృష్ణుడు ఈ పించాన్ని ఎందుకు ధరిస్తాడు అన్న ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది కదా? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సమస్త సృష్టిలో కనీసం ఒకదానితో ఒకటి టచ్ కాకుండానే సంతానం పొందగలిగేది కేవలం నెమలి మాత్రమే. వాతావరణం మారిన సమయంలో మగ నెమలికి సంతోషం కలిగినప్పుడు పురి విప్పి డాన్స్ చేస్తుంది. ఆ సమయంలో దాని కళ్ల నుంచి వచ్చే ఆనంద భాష్పాలను ఆడ నెమలి నోట్లోకి వెళ్తాయి. ఆ నీటిని త్రాగడం వల్ల ఆడనెమలి సంతాన భాగ్యాన్ని పొంది గర్భం దాల్చుతుంది. అలాగే కృష్ణుడు కూడా ఆడవారితో కలవకుండానే వారితో సంభోగించడం ఆయనకు సాధ్యమని, నెమలి కూడా కలవకుండానే పునరుత్వత్తి చేస్తున్నాయి కాబట్టి కృష్ణుడు నెమలి ఈక తలలో పెట్టుకుంటాడని పురాణ కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్న కథ ఇది. ఇక నెమలి అంత పవిత్రమైంది కనుకే మన జాతీయ పక్షి అయిందని అంటుంటారు. కానీ శాస్త్రవేత్తలు ఇది ఎలా సాధ్యం, నూటికి నూరు శాతం అవాస్తవమని భావిస్తున్నారు.

Read more:

అట్రాక్టివ్ రియాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్.. పోస్టులు వైరల్‌గా మారడంపై నిపుణుల పరిశోధన


Next Story