హోలీ ఆడిన తర్వాత దావత్ ఎందుకు చేసుకుంటారో తెలుసా?

by Dishanational2 |
హోలీ ఆడిన తర్వాత దావత్ ఎందుకు చేసుకుంటారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : హోలీ పండుగ అంటే చాలా మందికి ఇష్టం. తమ స్నేహితులు, బావ, బామ్మర్దులు ఇలా వరసను బట్టి చాలా మంది హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే హోలీ ఆడిన తర్వాత కొన్ని ప్రాంతాలలో ప్రసాదాలు తీసుకొంటే, మరికొన్ని ప్రాంతాలలో నాన్ వేజ్, డ్రింగ్స్ తీసుకుంటూ దావత్‌లు చేసుకుంటారు. హోలీ రోజు తీసుకునే వాటిలో తండై ఒకటి. యాలకులు, బాదం, మిరియాలు, గసగసాలు, సోంపు వంటివి తీసుకుంటారు. అయితే హోలీరోజు తండైని ప్రసాదంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంటారు.

ఇక హోలీ ఆడిన తర్వాతా ఎక్కువ అల్కాహాల్ సేవించి మైకంలో మునిగి పోతుంటారు చాలా మంది. దానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు. ఎందుకంటే హోలీ రోజు చాలా సేపు ఎండలో ఆట ఆడి అలసిపోతుంటారు. కొంత మంది హ్యంగోవర్‌కు గురి అవుతుంటారు. అయితే అలసటను మర్చిపోవడానికి స్నేహితులతో కలిసి సరదగా పార్టీ చేసుకుంటారంట. అలాగే బావ,బామ్మర్దులకు కల్లులాంటివి దావత్ ఇచ్చే అలవాటు తెలంగాణలో ఆనాటి కాలం నుంచి వస్తుంది.

Next Story