తస్మాత్ జాగ్రత్త.. ఈ కూరగాయను కలిపి తింటున్నారా.. అంతే సంగతి..

by Disha Web Desk 20 |
తస్మాత్ జాగ్రత్త.. ఈ కూరగాయను కలిపి తింటున్నారా.. అంతే సంగతి..
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది వంట మాస్టార్లు కొత్త కొత్త వంటకాలను చేసేందుకు కొన్ని కూరగాయలను కలిపి వండేస్తూ ఉంటారు. ఆ వంటలు రుచికరంగా ఉంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు. అంతే కాదు ఆ వంటకాల వలన పోషకాలు కూడా ఎక్కువగానే అందుతాయి. అయితే కొన్ని కూరగాయల కాంబినేషన్ తో వండిన వంటలు ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు కలిపి తిన్నా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే వంటలు చేసేటప్పుడు ఏయే కూరగాయల కాంబినేషన్ ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుని వండాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి కూరగాయలు కలిపి వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది ఆరోగ్యానికి మంచిది అంటూ పెరుగులో పండ్లు కలుపుకుని తింటుంటారు. వాస్తవానికి అలా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలు, పెరుగు తిన్నాక రెండు గంటల వరకు ఎలాంటి పండ్లను తీసుకోకుండా రెండు గంటల తరువాత పండ్లను తినాలని చెబుతున్నారు. పెరుగు పడని వారు రాత్రి వేళల్లో తింటే జలుబు, అలర్జీలు పెరిగిపోతాయి.

అలాగే కొంత మందికి భోజనం చేసిన వెంటనే పండ్లను తినే అలవాటు ఉండి ఏదో ఒక రకం పండుని తింటుంటారు. అలా చేయడం కూడా ఆరోగ్యానికి హానికరం చెబుతున్నారు. ఆహారం తిన్న వెంటనే పండ్లను తినడం వల్ల అది జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది. భోజనం, పండ్లు జీర్ణం అయ్యేలోపే లోపల ఉన్న ఆహారం పులిసిపోయి పేగులు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే భోజనం చేశాక ఏం తినాలన్నా సుమారు రెండు గంటల సమయం గడవాలని చెబుతారు.

దుంపలు, మాంసం ఉత్పత్తులను కలిపి తినకూడదని వైద్యులు చెబుతున్నారు. రెండు కలిపి తింటే దుంపల్లో ఉండే పిండి పదార్థాలు, మాంసం లో ఉండే మాంసకృత్తులు కలిసి వాటిలో ఉండే సూక్ష్మ పోషకాలు శరీరం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. డైజేషన్ కూడా నెమ్మదిగా అవుతుంది. దీని కారణంగా కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే దుంప కూరలని మాంసాహారాన్ని కలిపి తీసుకోరాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఇక టమాటాలు, చిలకడదుంపలను కలిపి తింటే అనారోగ్యం పాలవుతారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన టమోటాల్లో ఉండే సిట్రిక్ యాసిడ్, దుంపల్లో ఉండే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ కలిసి అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.


Next Story

Most Viewed