- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
30 ఏళ్ళు వచ్చాక పెళ్ళి చేసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా..?

దిశ,వెబ్ డెస్క్: ముప్పై ఏళ్ళు వచ్చాక ఎక్కడకెళ్లిన పెళ్లి ఎప్పుడని అడిగి ఇబ్బంది పెడుతుంటారు. అలా అడుగుతారేమో అని కొంత మంది బయటకు కూడా రారు. అప్పటికే అంతా అయిపోయిందని చాలా మంది అనుకుంటారు. కానీ, నిజానికి జీవితాన్ని బాగా అర్థం చేసుకుని సొసైటీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే వయసు ఇదే అని చాలా మందికి తెలియదు. అయితే 30 వ యేడులో పెళ్ళి చేసుకునేవారు కొన్ని విషయాల్లో సరిగ్గా ఆలోచిస్తారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
స్పష్టత
ముప్పై ఏళ్ళు దాటిన వారు పెళ్ళి చేసుకునేవారికి చాలా స్పష్టత ఉంటుంది.వాళ్లకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలరు. కాబట్టి, ఈ వయస్సు ఉన్న వారిని ఎలాంటి సందేహాలు లేకుండా పెళ్లి చేసుకోవచ్చని చెబుతున్నారు. పెళ్లి చేసుకున్న వారిని ఈజీగా అర్థం చేసుకోగలరు.
అర్ధం చేసుకోవడం
జీవితాన్ని బాగా అర్థం చేసుకునే ఆలోచన 30 ఏళ్ళకే వస్తుంది. 20 సంవత్సరాల వయస్సులో, ఒకరి ప్రతిభని పూర్తిగా గుర్తించి, తగిన ఉద్యోగం, వృత్తిని ఎంచుకోవడం కొంత ఇబ్బంది, ఆందోళన, గందరగోళం ఉంటుంది. కుటుంబ పోషణ కూడా కష్టంగానే ఉంటుంది. కానీ, 30 ఏళ్ళ తర్వాత ఓ స్పష్టత ఉంటుంది. అటు ఇంట్లో వారిని, ఇటు పెళ్లి చేసుకున్న అమ్మాయిని మంచిగా చూసుకోగలరు.