దేవాలయంలో అసలు చేయకూడని పనులు ఏంటో తెలుసా..?

by Disha Web Desk |
దేవాలయంలో అసలు చేయకూడని పనులు ఏంటో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : హిందూ దేవాలయాలు అత్యధికంగా ఉన్న దేశం ఏదంటే భారత దేశం అనే చెప్పొచ్చు. వేల ఏండ్ల నాటి చరిత్ర కలిగిన దేవాలయాలకు నెలవు ఈ దేశం. క్రీ.శ.1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంటాయి. భక్తజనులను కాపాడేందుకు ఆ భగవంతుడు అర్చారూపిఐ శ్రీ వైఖానస శాస్త్రం ప్రకారం భూలోకానికి వచ్చాడు. అయితే భగవంతుడు నెలవై ఉన్న ప్రతి ఆలయంలో ప్రాకార దేవతలు, ద్వారపాలకులు, పరివార దేవతలు వారి వారి స్థానంలో కొలువై ఉంటారు.

దేవాలయ నియమావళి...

దేవాలయానికి ప్రతి నిత్యం వచ్చే అర్చకులు, భక్తులు, అధికారుల్లో కొంత మంది తమకు తెలియకుండానే ఆలయంలో చేయకూడని పనులు చేస్తారు. అయితే ఆగమ శాస్త్రంలో దేవాలయాలలో ఏ విధంగా వ్యవహరించకూడదో వివరంగా తెలపబడింది.

అసలు ఆలయంలో ఏయే పనులు చేయకూడదు, ఏయే పనులు చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...

* ఆలయం లోపల వాహనం మీద గానీ, పాదరక్షలు వేసుకుని ప్రవేశించి తిరగకూడదు. ఆలయ ప్రాంగణంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకూడదు.

* కొంత మంది భక్తులు ఆలయంలో ప్రవేశించగానే ప్రదక్షిణలు చేయకుండా నేరుగా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అలా ఎప్పటికీ చేయకూడదు. ముందుగా ఆలయానికి ప్రదక్షిణలు చేసి, ఆ తరువాతే దైవదర్శనానికి లోనికి ప్రవేశించాలి.

* ఎప్పుడూ కూడా ఆలయంలోకి ఉత్తచేతులతో వెల్లకూడదు. పుష్పం, పత్రం, టెంకాయ లాంటివి ఆలయానికి తీసుకుని పోవాలి.

* దేవాలయానికి వెళ్లే ముందు కాని, వెళుతూ కాని తినుబండారాలు తినరాదు. తాంబూల చర్వణం చేస్తూగాని, స్త్రీ పరుషులు నుదుటికి తిలకం ధరించకుండా ఆలయంలోకి ప్రవేశించరాదు.

* చేతిలో మారణాయుధాలు, ఆయుధాలు పట్టుకొనిగాని, తలపై టోపి, తలపాగా ధరించిగాని ఆలయ ప్రవేశం చేయకూడదు.

* ఆలయ ప్రాంగణంలో ఎట్టిపరిస్థితుల్లో మల, మూత్ర విసర్జన చేయకూడదు. ఆలయం ముందు, ఆలయ ప్రాంగణంలో ఎట్టి పరిస్థితుల్లో కాళ్లు చాపుకొని కూర్చోడం, నిద్రపోవుటం, వీపును దేవుని వైపు చూపిస్తూ కూర్చోవడం చేయకూడదు.

* ఆలయంలో ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, నిందించడం, ఎదుటి వారిని ధూషించడం వంటి పనుల చేయకూడదు. అంతే కాదు.. మూగజీవాలను బలి ఇవ్వడం చేయకూడదు. ఇతరులకు దుఃఖం కలిగించే విధంగా ప్రవర్తించరాదు. ఆలయంలో ఎన్నడూ ఇతరులతో వివాదాలు పెట్టుకోరాదు.

*ఆస్తి, హోదా, అంతస్తు ఉందనే అహంకారం, గర్వం, అధికార దర్పణం చూపించకూడదు. సమయం కాని సమయంలో ఆలయానికి వచ్చి అకాల సేవలను చేయరాదు. ఒక చేతితో ప్రణామం చేయడం, ఒక్క చేతితో హారతిని తీసుకోవడం లాంటి పనులు చేయకూడదు. *ఆలయానికి వచ్చినప్పుడు దేవునికి తప్పించి, ఇతరులకు నమస్కారం చేయకూడదు.

దేవాలయాలు అన్ని ఒకే రకంగా ఉండవు.. 5 రకాలుగా ఉంటాయి.

1. స్వయం వ్యక్త స్థలాలు : అంటే ఆ దేవుడే స్వయంగా భూలోకంపై అవతరించి వెలిసిన స్థలాలు అంటారు.

2. పురాణ స్థలాలు : ఈ దేవాలయాలు పురాణగాధల్లో ఎంతో ప్రాచుర్యం పొందినవి.

3. సిద్ధ స్థలాలు : ఈ దేవాలయాలు పూర్వం మహార్షులు, మునులు కఠోరమైన తపస్సు చేసి దేవతామూర్తులను ప్రతిష్ఠించినవి అర్థం.

4. దివ్య స్థలాలు : దేవతలచే దేవాలయాలు ప్రతిష్ఠ చేయబడిన ఉన్న ప్రదేశాలు. ఈ ఆలయాలను కూడా సుమారుగా స్వయం వ్యక్త స్థలాలుగానే పరిగణలోకి తీసుకోవచ్చు.

5. మానుష స్థలాలు : ఈ ఆలయాలు రాజుల కాలంలో రాజులు, భక్తులు కట్టించి దేవతామూర్తులను ప్రతిష్ఠ చేయబడినవి.


Next Story

Most Viewed