ఉల్లి అంటే ఉతుకుడే.. 45 ఏళ్లుగా ఉల్లిని తినని గ్రామస్తులు వీళ్లే!

by Sumithra |
ఉల్లి అంటే ఉతుకుడే.. 45 ఏళ్లుగా ఉల్లిని తినని గ్రామస్తులు వీళ్లే!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉల్లిచేసిన మేలు తల్లికూడా చేయదంటారు. ఏ వంట చేసినా ఆ వంటకి రుచిరావాలంటే ఖచ్చితంగా ఉల్లి, వెల్లులి వంటలో పడాల్సిందే. కొన్ని కొన్ని సార్లు వాటి ధరలు ఆకాశాన్ని అంటినా కూడా వంటల్లో ఉల్లివాడకాన్ని తగ్గించరు. అంతే కాదు ఉల్లిని, వెల్లుల్లిని వాడడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. సీజనల్ వ్యాధుల బారినుంచి కూడా ఇవి కాపాడతాయి. వీటి ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా ఓ గ్రామంలో మాత్రం అస్సలు వాటిని వాడరంట. గత 45 ఏళ్లుగా ఓ గ్రామ ప్రజలు వెల్లుల్లి, ఉల్లిపాయలను వినియోగించరంట. అసలు ఆ గ్రామం ఎక్కడ ఉంది, ఎందుకు వాటిని వాడరు, దానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బిహార్‌లోని జెహనాబాద్ జిల్లాలోని చిరి పంచాయతీ పరిధిలోకి త్రిలోకి బిఘ అనే గ్రామం ఉంది. జెహనాబాద్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ.ల దూరంలో ఉండే ఈ గ్రామంలో సుమారుగా 30 నుంచి 35 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ గ్రామంలోని ప్రజలు 45 ఏళ్ల నుంచి ఉల్లి, వెల్లుల్లి అస్సలు తినరంట. ఈ గ్రామంలో ఎంతో పురాతనమైన ఠాకూర్‌బడి అనే ఆలయం ఉందట. ఉల్లి, వెల్లులి తిని ఈ ఆలయంలో ఉండే దేవుణ్ణి పూజించరాదట. ఒకవేళ ఎవరైనా వాటిని వాడితే ఆ గ్రామంలో, వారి ఇళ్లలో చెడు జరుగుతుందని, అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని వారి నమ్మకం. అందుకే ఇక్కడి ప్రజలంతా ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఆహారం తీసుకుంటారు. అక్కడి ప్రజలు ఈ సంప్రదాయాన్ని చాలా కాలంగా పాటిస్తున్నారని త్రిలోకి బిఘా గ్రామ పెద్దలు తెలిపారు. ఈ గ్రామంలో కేవలం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు మాత్రమే కాదు, మాంసం, మద్యం కూడా నిషేధించారట.

Also Read..

బ్లడ్‌లో ఆక్సిజన్ తగ్గితే ప్రాణహాని.. ఈ ఫ్రూట్స్ తీసుకుంటే సేఫ్..

Next Story

Most Viewed