అసలు ఆక్సిజన్ ఎలా పుట్టిందో తెలుసా?

by Anjali |
అసలు ఆక్సిజన్ ఎలా పుట్టిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సమయంలో ఆక్సిజన్ అందక రోగులు ఎంతగా అవస్థలు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రాణాలు నిలబెట్టే ఈ ఆక్సిజన్ సమస్త జీవజాలాల మనుగడకు అవసరం. కాబట్టి ఈ ప్రాణవాయువు ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆక్సిజన్‌కు జన్మనిచ్చింది ఓ బ్యాక్టీరియా. వినడానికి వింతగా ఉన్న ఇదే వాస్తవం. కోట్లాది సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఆక్సిజన్ అనేది లేదు. సుమారు 459 కోట్ల ఏళ్ల క్రితం వాయువులు, దుమ్ము, ధూళి ఒకచోట స్థిరపడి భూగోళం ఏర్పడింది. మరో వంద కోట్ల అనంతరం భూమిపై ఏకకణ జీవితో జీవం ఆవిర్భవించింది.

ఆ సమయంలో ప్రోక్లొరోకాకస్‌ అనే బ్యాక్టీరియా తన మనుగడ కోసం నీరు, సూర్యరశ్మి, కార్బన్‌ డైఆక్సైడ్‌ల ద్వారా కిరణజన్య సంయోగ క్రియను జరిగించి అవసరమైన శక్తిని పొందడం మొదలుపెట్టింది. కాగా, సముద్రంలో ఉండే ఈ బ్యాక్టీరియా నిర్వహించిన కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతూ వాతావరణంలో కలవడం స్టార్ట్ అయ్యింది. ఇలా 300 కోట్ల ఏళ్ల తర్వాత వాతావరణంలో పెద్ద మొత్తంలో O2 లభించింది. దీన్నే శాస్త్రవేత్తలు గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్‌గా వివరించారు. ఇలా మొదలైన ఆక్సిజన్ ప్రస్తుతానికి భూమిపై ఉన్న వాతావరణంలో 21 శాతానికి పెరిగింది. కోట్లాది జీవరాశుల జన్మకు, మనుగడకు కారణమయ్యింది.

Next Story