శానిటరీ ఫ్యాడ్స్‌ను ఎన్నిరకాలుగా వాడొచ్చో తెలుసా?

by Samataha |
శానిటరీ ఫ్యాడ్స్‌ను ఎన్నిరకాలుగా వాడొచ్చో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది మహిళలు పీరియడ్స్ టైమ్ లో శానిటరీ ప్యాడ్స్ వాడుతూనే ఉంటారు. అయితే చాలా వరకు దీని గురించి మాట్లడటానికి అమ్మాయిలు అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మగవారి ముందు మాట్లాడటానికి అస్సలే ఇష్టపడరు. ఇక వీటిని ఓన్లీ పీరియడ్స్ టైమ్‌లో వాడుతారు? అప్పుడే వాడుకోవచ్చు అనుకుంటారు కానీ, శానిటరీ ప్యాడ్స్ చాలా రకాలుగా వాడొచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.శానిటరీ ప్యాడ్స్‌లోని ప్యాంటీ లైనర్స్‌ని మన ఇంట్లొ గ్యాడ్జెట్స్ శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చునంట. ఎందుకంటే ఇది చాలా స్మూత్‌గా ఉంటుంది అందువలన గ్యాడ్జెట్స్, ఎల్‌ఈడీ స్క్రీన్స్ క్లీన్ చేయడానికి ఇవి ఉపయోగపడుతాయి. అలాగే బూట్లతో వచ్చే సమస్యల నుంచి కూడా ఈ శానటరీ ప్యాడ్స్ ఉపశమనం కలిగిస్తాయంట. అది ఎలాగంటే? మనం షూస్ సరిగ్గా ధరించకపోతే, కాళ్లకు బొబ్బలు రావడం, వాపురావడ లాంటి సమస్య ధరి చేరుతుంటుంది. అయితే ఈ బూట్లులో శానిటరీ ప్యాడ్స్ ప్యాంటీ లైనర్స్‌ను చిన్న ముక్కులగా కట్ చేసి వాటిని బూట్లు కొరికే చోట అతికించాలి. దీని వలన మీ పాదాలకు సరిపోయే లా బూట్లు ఉండటమే కాకుండా ఎలాంటి సమస్యలు ధరి చేరవు.

చెమట నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంట. అది ఎలా అంటే విపరీతంగా చెమటలు పడుతున్నాయని మీకు అనిపించినప్పుడు, శానిటరీ ప్యాడ్స్ లోని ప్యాంటీ లైనర్స్ కట్ చేసి, వాటిపై ఫెర్ఫ్యూమ్ స్ప్రే చేసి వాటిని మీ షర్ట్ లేదా టాప్స్ లోపల ఏదైనా భాగంలో ఉంచాలి. దీని వలన అది చెమటను మొత్తం పీల్చేసుకుని మీకు ఇబ్బంది లేకుండా చేస్తుంది.

Next Story

Most Viewed