కోకోనట్ మలై చేసే మేలేంటో తెలుసా..?

by Dishanational4 |
కోకోనట్ మలై చేసే మేలేంటో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: కోకోనట్ వాటరంటే ఇష్టపడని వారంటూ ఉండరు. సమ్మర్ వచ్చిందంటే ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి వాటర్ తాగడానికి అందరూ ఆసక్తి చూపుతారు. అయితే కొబ్బరి నీళ్లే కాదు, వాటిని తాగాక మిగిలి ఉండే మలై కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని డైటీషియన్లు చెప్తున్నారు.

కొబ్బరి మలైలో ఆరోగ్యానికి మేలు చేసే కొలెస్ర్టాల్ ఉంటుంది. కాబట్టి ఇది అధిక బరువు సమస్యను నివారిస్తోంది. జీర్ణాశయ వ్యాధులను దూరం చేస్తుంది. జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. శరానికి కావలసిన శక్తిని వెంటనే అందిస్తుంది. కొబ్బరి మలైలోని కార్బ్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్లు బ్లడ్ షుగర్ సమస్యలను రానివ్వవు. పాలి ఫినాల్‌ను కూడా కలిగి ఉండటం మూలంగా శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. గ్యాస్ట్రిక్ వల్ల తలెత్తే ఛాతీ మంటను అదుపు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డయాబెటిస్‌ వల్ల కలిగే ఇబ్బందులను నివారిస్తుంది.

ఆయిలీ ఫుడ్‌కు దూరంగా ఉండే వారికి తగిన శక్తినివ్వడంలో ఇది తోడ్పడుతుంది. అనేక రకాలుగా మేలు చేసే కొబ్బరి మలైలో సంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి మరీ అతిగా కూడా తీసుకోవద్దని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే కొబ్బరి వాటర్‌ను మాత్రం ఎవరైనా, ఎంతైనా తీసుకోవచ్చునట.


Next Story

Most Viewed