చేతిలోంచి వస్తువులు తరచూ జారిపోతున్నాయా? దీనికే సంకేతం!

by Disha Web Desk 9 |
చేతిలోంచి వస్తువులు తరచూ జారిపోతున్నాయా? దీనికే సంకేతం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో జీవన శైలి లేదా మరెన్నో కారణాల వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పూర్వం వైద్యులే పెషేంట్ల దగ్గరకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు రోగులే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే చేతిలోంచి పదే పదే వస్తువులు జారి కిందపడుతోన్న అనారోగ్య సమస్య చాలా మందిలో తలెత్తుతోంది. ఇది గుండెకు, మెదడుకు, నాడీ వ్యవస్థకు, నరాలకు సంబంధించిన అనారోగ్యానికీ గురవుతారని.. ఇటీవలే జర్నల్ ఆఫ్ అల్జీమర్స్‌లో ప్రచురితమైంది.

దీనివల్ల చేతుల్లో బలం తగ్గడం, చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం లాంటి జబ్బులు రావడానికి సంకేతాలట. ఈ వ్యాధి సుమారు 40 ఏళ్ల వయస్సు దాటిన వారిలో మెల్లమెల్లగా కండరాల బిగువు తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. 70 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ఈ జబ్బు వల్ల ఎదురయ్యే విషమ పరిణామాలు కనిపిస్తాయని అంటున్నారు. దీన్ని మన దరిన చేరకుండా ఉండాలంటే.. శరీరంలోని అవయవాల పటుత్వం కోసం రోజూ వ్యాయామం చేయాలంటున్నారు వైద్య నిపుణులు.

Next Story