ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. అయితే మద్యం వెంటనే మానేయండి!

by Prasanna |
ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. అయితే మద్యం వెంటనే మానేయండి!
X

దిశ,వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన అక్కడ మద్యం తప్పకుండా ఉంటుంది. అలాగే పాత కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా పెగ్గు వెయ్యడం మాత్రం కామన్. కానీ ఇది అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తే అది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ లక్షణాలు మనలో కనిపించినప్పుడే మద్యం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉబ్బరం

మీరు ప్రతిరోజూ ఉబ్బరంతో బాధపడుతుంటే, మద్యం సేవించడం దీనికి ప్రధాన కారణం కావచ్చు. ఎందుకంటే ఆల్కహాల్ జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కడుపులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా దెబ్బతింటుంది.

అనారోగ్యంగా ఉండడం

కొంత మంది ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మద్యం సేవిస్తుంటారు. ఇలా తాగడం వలన రోగనిరోధక వ్యవస్థపై ఆల్కహాల్ భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఆల్కహాల్ తరచుగా తీసుకోవడం వల్ల మీ రక్తంలో వ్యాధి- పోరాట కణాల సంఖ్య తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిద్ర పట్టకపోవడం

మద్యం తాగితేనే నిద్ర పడుతుందనే చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే, మద్యం కూడా నిద్ర లేమి సమస్యలను కలిగిస్తుందనే విషయం తెలుసుకోలేక పోతున్నారు. ఆల్కహాల్ వల్ల ఎక్కువ సేపు నిద్ర పట్టదు. మీరు పగటిపూట నిద్రించడానికి ఇబ్బంది పడుతుంటే, మద్యపానం మానేయడం మంచిది.. లేదంటే అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.

Advertisement

Next Story