పాములు నాగస్వరం వింటే నిజంగానే నాట్యం చేస్తాయా?

by Dishanational2 |
పాములు నాగస్వరం వింటే నిజంగానే నాట్యం చేస్తాయా?
X

దిశ, వెబ్‌డెస్క్ : పాములంటే ప్రతి ఒక్కరికీ భయమే ఉంటుంది. దూరం నుంచి చూసి కూడా ఎంతో మంది భయపడుతుంటారు. అయితే పాములను చూడటాని భయపడినా, వాటికి సంబంధించిన విషయాల గురించి చాలా ఇంట్రెస్టింగ్‌గా వింటుంటాం. అందులో ముఖ్యంగా పాములు నాగస్వరానికి లయబద్ధంగా నాట్యం చేయడం. అవునూ చాలా మంది వినే ఉంటారు. పాములు నాగస్వరానికి డ్యాంన్స్ చేస్తాయని, అంతే కాకుండా మన ఇంటి వద్ద పెద్దవారు కూడా పాము నాట్య స్వరం వస్తే సౌండ్ తక్కువచేస్తుంటారు. అంతే కాకుండా మనం సినిమాల్లో కూడా చూసే ఉంటాం.. నాట్య స్వరానికి పాములు లయబద్ధంగా నాట్యం చేయడం. అయితే దీనిపై నిపుణులు షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు పాములు నాగస్వరానికి డ్యాన్స్ చేయలేవంటూ చెప్పుకొచ్చారు. పాములు నాగ‌స్వ‌రాన్ని విన‌లేవ‌ని, అస‌లు పాముల‌కు బాహ్య చెవులు, క‌ర్ణ‌భేరి ఉండ‌వంటూ వారు తెలిపారు.

అసలు విషయంలోకి వెళ్లితే.. వారు మాట్లాడుతూ, పాము లోపలి చెవి చర్మానికి అనుసంధానమై ఉంటుది. భూమి మీద వ‌చ్చే కంప‌నాల‌ను చ‌ర్మానికి, లోప‌లి చెవికి అనుసంధాన‌మైన క‌ర్ణ‌స్థంభిక గ్ర‌హించి ఆ త‌రంగాల‌ను పాము లోప‌లి చెవికి అంద‌వేస్తుంది. ఈ విధంగా మాత్ర‌మే పాము శ‌బ్దాల‌ను గ్ర‌హిస్తుంది.. గాలి ద్వారా వ‌చ్చే శ‌బ్ధ త‌రంగాల‌ను పాము విన‌లేదంటూ పేర్కొన్నారు.

అయితే పాము శ‌బ్ధానికి అనుగుణంగా నాట్యం ఎలా చేస్తుందంటే.. పాముకు ముందే నాగస్వరం ఊదే వ్యక్తి సిగ్నల్స్ ఇస్తాడంట. అది ఎలా అంటే అతను నాగస్వరం ఊదే ముందు పాము బుట్టమీద కొడతాడంట. దీంతో అది భయంతో లేచి పడగ విప్పుతుందంట, ఆక్షణంలోనే బూరను ఊదే వ్యక్తి, బూరను కదిలిస్తూ ఊదుతాడు, దీంతో ఆ బూరను కాటు వేయడానికి పాము కూడా పడగ విప్పి బూర చుట్టూ తిరుగుతుందంట.

ఇవి కూడా చదవండి: అద్భుతం సృష్టించిన 11 ఏళ్ల చిన్నారి.. నెట్టింట్లో ప్రశంసల వర్షం



Next Story

Most Viewed