మహిళలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ.. ప్రపంచంలో ఇక్కడే ఫస్ట్!

by Disha Web Desk |
మహిళలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ.. ప్రపంచంలో ఇక్కడే ఫస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు నెలసరి సమస్యలతో పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. రుతుక్రమం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలకు తోడు శానిటరీ ప్యాడ్స్ కోసం పడే కష్టాలు చెప్పలేనివి. కొంత మంది మహిళలు, యువతులు మెడికల్ షాపులకు వెళ్లి నేరుగా శానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటారు. దీనికి ప్రధాన కారణం వారిలో ఉండే భయం.. సిగ్గే. ఈ సమస్యలు ఎలా ఉన్నా.. స్కాట్‌లాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలందరికీ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్‌లోనూ చట్టం చేసింది.

ఆగస్ట్ 15న ఉచిత శాలటరీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ప్రతి మహిళలకు ఈ ప్యాడ్స్ అందే విధంగా చర్యలు చేపట్టింది. దీనికి కోసం రూ.2500 కోట్లను ఖర్చు చేస్తోంది. మహిళలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేసే మొదటి దేశంగా స్కాట్‌లాండ్ చరిత్ర సృష్టించింది. ఉచిత పీరియడ్ ప్రొడెక్ట్స్ చట్టం -2020 ప్రకారం శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా పొందడం స్కాట్‌లాండ్ మహిళల హక్కు అని ఆ దేశ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆగస్ట్ 15 నుంచి టాంపన్స్‌, శానిటరీ ప్యాడ్స్‌ వంటి పీరియడ్‌ ప్రాడెక్ట్స్‌ను పాఠశాలలు, కళాశాలలు వంటి బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల కోసం స్కాట్‌లాండ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.


Next Story