పురుషుల్లో అంగస్తంభన మెనోపాజ్ కిందకు వస్తుందా?

by Disha Web Desk 9 |
పురుషుల్లో అంగస్తంభన మెనోపాజ్ కిందకు వస్తుందా?
X

దిశ, ఫీచర్స్ : స్త్రీలలో రుతు విరతి గురించి విన్నాం కానీ తాజాగా మేల్ మెనోపాజ్ చర్చ తెరమీదికి వచ్చింది. 45-60 ఏళ్ల మధ్య పురుషుల్లో కలిగే హార్మోనల్ చేంజెస్ ను ఆండ్రోపాజ్‌గా గుర్తించిన ఈస్ట్ మిడ్‌లాండ్స్ అంబులెన్స్ సర్వీస్.. వన్ ఇయర్ పెయిడ్ లీవ్ ప్రకటించింది. అయితే ఈ మూవ్ ఫిమేల్ మెనోపాజ్ ను కించపరిచినట్లు ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఆండ్రోపాజ్‌ అంటే ఏమిటి? తెలుసుకుందాం.

ఆండ్రోపాజ్ సాధారణ లక్షణాలు లిబిడో తగ్గడం, అంగస్తంభన, తగ్గిన కండర ద్రవ్యరాశి, బలం, అలసట, మానసిక కల్లోలం, నిద్ర విధానాలలో మార్పులు, శరీర కొవ్వు పెరగడం, తక్కువ ఎముక సాంద్రత. కాగా సాధారణంగా టెస్టోస్టెరాన్ స్థాయిలలో హెచ్చుతగ్గుల వల్ల 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులను ప్రభావితం చేస్తుంది. ధూమపానం, అధిక మద్యపానం, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఊబకాయం, నిర్దిష్ట మందులు ఈ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. అయితే పురుషులందరిలోనూ ఈ పరిస్థితి సంభవించదు.

తీవ్రత అనేది వ్యక్తి ఆరోగ్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ దశలో పురుషులకు మద్దతుగా ఈస్ట్ మిడ్‌లాండ్స్ అంబులెన్స్ సర్వీస్ చేసిన ప్రయత్నం ప్రశంసనీయమే. కానీ దీన్ని 'పురుషుల మెనోపాజ్' అని లేబుల్ చేయడం వల్ల రుతువిరతి సమయంలో స్త్రీలలో వచ్చే ముఖ్యమైన శారీరక మార్పులను తక్కువ చేసి చూపుతిన్నారని కొందరు వాదన.

Next Story