డిజిటల్ డిపెండెన్సీ.. రోజుకు 2 వేలసార్లు దానిని టచ్ చేస్తున్న యూజర్లు!

by Javid Pasha |

ఒక అధ్యయనం ప్రకారం.. హెవీ యూజర్లు (టాప్ 10%) రోజుకు 5,427 సార్లు తమ‌ ఫోన్లను స్వైప్ చేస్తున్నారు.

డిజిటల్ డిపెండెన్సీ.. రోజుకు 2 వేలసార్లు దానిని టచ్ చేస్తున్న యూజర్లు!
X

దిశ, ఫీచర్స్ : మీవద్ద స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటుంది కదా.. అయితే రోజుకు ఎన్నిసార్లు దానిని టచ్ చేస్తారు?’ ‘ఏమో.. ఎవరు లెక్క పెట్టుకున్నారు’ అంటారా! కానీ dscout అనే రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం మాత్రం.. సాధారణంగా వ్యక్తి రోజుకు 2,000 కంటే ఎక్కువసార్లు, యావరేజ్‌గా అయితే 2,617 సార్లు తన స్మార్ట్‌ఫోన్‌ను (ట్యాప్, స్వైప్, క్లిక్ వంటివి కలిపి) టచ్ చేస్తున్నారు. అప్పట్లోనే అంత ఉంటే ఈ టచింగ్ సంఖ్య ఇప్పుడు ఇంకెన్నిరెట్లు పెరిగి ఉంటుందో మరి!

స్టడీలో భాగంగా dscout సంస్థ 94 మంది ఆండ్రాయిడ్ యూజర్లను 5 రోజులపాటు 24 గంటలు ట్రాక్ చేశారు. దీని ప్రకారం హెవీ యూజర్లు (టాప్ 10%) రోజుకు సుమారు 5,427 సార్లు తమ‌ ఫోన్లను అవసరం కోసం టచ్ చేస్తున్నారు. అంటే ఇది సంవత్సరానికి 2 మిలియన్‌సార్లు అవుతుంది. అంటే.. స్మార్ట్‌ఫోన్‌లు మన రోజువారీ జీవితంలో ఎంత డీప్‌గా ఇంటిగ్రేట్ అయ్యాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే.. ఈ టచ్‌లు కేవలం టైమ్‌పాస్ కోసం మాత్రమే కాదు. సగటును రోజుకు 76 సెషన్లు (Phone pickups) ఉంటాయి. ఎక్కువగా ఉపయోగించే యూజర్లకు 132 సెషన్ల వరకు ఉంటాయి. ఇక స్క్రీన్‌ టైమ్ సుమారు 2.42 గంటలు, హెవీ యూజర్లకైతే 3.75 గంటలు ఉంటున్నది. అయితే ఇదంతా కమ్యూనికేషన్, వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్, సోషల్ మీడియా స్క్రోలింగ్ టెక్స్టింగ్ (Texting), యాప్‌లు వాడటం వంటి అన్ని రకాల యాక్టివిటీల ద్వారా జరుగుతుంది. మొత్తానికి ఈ అధ్యయనం నేడు డిజిటల్ డిపెండెన్సీ, పెరిగిన స్క్రీన్‌టైమ్ ప్రభావాలను తెలియజేయడంతోపాట స్మార్ట్‌పోన్ మన జీవితంలో ఎంత ప్రధానమైందో తెలియజేస్తోందని సాంకేతిక నిపుణులు అంటున్నారు.

Next Story