పొట్లకాయ జ్యూస్.. ఆ సమస్యలకు ఉపయోగపడుతుందని తెలుసా?

by Disha Web Desk 10 |
పొట్లకాయ జ్యూస్..  ఆ సమస్యలకు ఉపయోగపడుతుందని తెలుసా?
X

దిశ, ఫీచర్స్: దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం.. సహజ ఆహారాలు, పానీయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పుచ్చకాయ, దోసకాయ, మామిడి, నారింజ, పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో నాలుగో వంతు నీటితో నిర్మితమై ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి నీటి శాతం ఎక్కువ అందుతుంది.

బరువు తగ్గడం

పొట్లకాయ రసంలో చాలా తక్కువ కేలరీలు ఉండటం వలన ఇవి బరువును తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదనంగా, ఇది శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గుండెకు చాలా మంచిది

పొట్లకాయ రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఎందుకంటే, దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె సమస్యలను కూడా నివారిస్తుంది. రక్త ప్రసరణ సమస్యలు తలెత్తకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

అధిక జీర్ణశక్తి

పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు కడుపు ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. ఇది జీర్ణక్రియను కూడా సులభతరం చేస్తుంది.

మానసిక ఆరోగ్యం

పొట్లకాయ రసం తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తెలివితేటలు మరియు చురుకుదనాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

మన శరీరానికి రక్తం బాగా అందితే ఏ అవయవంలోనూ సమస్యలు తలెత్తవు. ఈ జ్యూస్ లో పెద్ద మొత్తంలో నీరు ఉంటుంది. అంటే మన శరీరానికి నీరుఎక్కువ అందుతుంది. దీని వల్ల రక్తప్రసరణ మెరుగుపడి రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.



Next Story

Most Viewed